Begin typing your search above and press return to search.
బీజేపీ రివర్స్ గేర్ మంత్రం చూశారా?
By: Tupaki Desk | 16 Jun 2017 2:47 PM GMTరాష్ట్రపతి ఎంపికకు సంబంధించి ఎన్నికల క్రతువు లేకుండా ఏకగ్రీవం చేసుకునేందుకు అధికార బీజేపీ చేయని యత్నమంటూ లేదు. ఎందుకంటే... తాము నిలిపిన అభ్యర్థి ఎక్కడ ఓటమిపాలవుతారోనన్న భయం ఆ పార్టీ నేతలను పట్టి పీడిస్తోంది. రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదలైనా... ఇప్పటికీ అభ్యర్థి విషయంలో ఓ అంచనాకు రాలేకపోతున్న బీజేపీ... విపక్షాలను దారికి తెచ్చుకునే పనిని ముమ్మరం చేసింది. అయితే ఇప్పటికే పలు మార్లు విపక్షాలతో సంప్రదింపులు జరిపిన బీజేపీ... తాజాగా మరోమారు తన కమిటీని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ - సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీల వద్దకు పంపింది.
స్ట్రైట్‌గా వెళితే పనికానప్పుడు రివర్స్‌గానైనా వెళ్లి ఆ పనిని చక్కబెట్టుకు రావాలన్నది నిపుణుల సలహా. ఇదే మంత్రాన్ని గుర్తుకు తెచ్చుకున్నారో, ఏమో తెలియదు గానీ... నేటి మధ్యాహ్నం విపక్షాల వద్దకు వెళ్లిన బీజేపీ కమిటీ రివర్స్ మంత్రాన్నే ఎంచుకున్నారు. తాము ఎంపిక చేసే అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని అడిగే బదులు... ఒకవేళ రాష్ట్రపతిగా మీరు ఎవరినైనా ఎంపిక చేసి ఉంటే చెప్పండి... మేం మద్దతు ఇస్తామంటూ ఆ కమిటీ సోనియా - ఏచూరీ వద్ద ప్రతిపాదించారట. ఈ వ్యూహం విన్న వారిద్దరూ తొలుత కాస్తంత ఆశ్చర్యం వ్యక్తం చేసినా... ఆ వెనువెంటనే సర్దుకుని రివర్స్ మంత్రంతో ఎంట్రీ ఇచ్చిన బీజేపీ కమిటీకి షాకిచ్చారట.
అధికార పక్షంగా ఉన్న మీరే ఇప్పటిదాకా అభ్యర్థి ఎవరన్నది ఎంచుకోలేకపోతే... మెమెలా నిర్ణయం తీసుకుంటామని ఎదురు ప్రశ్నించిన సోనియా, ఏచూరీలు... బీజేపీ నేతలకు ఎదురు షాకిచ్చారట. అయినా అధికార పక్షంగా ఉన్న మీరు... మీ అభ్యర్థి ఎవరన్న విషయం ప్రకటించకుంటే... మా అభ్యర్థిని మెమెలా ప్రకటిస్తామంటూ కూడా సోనియా గాంధీ కాస్తంత కటువుగానే సమాధానం ఇచ్చారట. దీంతో ఏం చేయాలో పాలుపోని బీజేపీ కమిటీ దిగాలు ముఖం వేసుకుని బయటకు వచ్చిందట. స్ట్రైట్ గా వెళ్లినా పని కాలేదన్న భావనతో రివర్స్ గేర్ లో వెళితే... అది కూడా బెడిసికొట్టడమేమిటని కూడా వారు తమను తామే నిందించుకుంటూ ఇంటి బాట పట్టారట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/