Begin typing your search above and press return to search.
తిట్టునే అస్త్రంగా మార్చిన మోడీ!
By: Tupaki Desk | 18 March 2019 5:40 AM GMTమోడీ దగ్గరి మేజిక్కులకు కొదవ లేదు. ఎలాంటి వాడినైనా తన దాసుడ్ని చేసుకోవటంలో ఆయనకున్న నైపుణ్యం అంతా ఇంతా కాదని చెప్పాలి. లేకపోతే.. గుజరాత్ రాష్ట్రానికి అన్నేళ్లు ఎదురులేని రీతిలో ఎలా పాలించగలుగుతారు? తనకు తానే అండ అయిన.. ఎవరూ తనకు తోడుగా నిలువని వేళలో పోరాడి.. తన సత్తా ఏమిటో ప్రదర్శించిన మోడీకి.. ప్రధాని హోదాతో పాటు.. భారీ ఇమేజ్ ఉన్న వేళ ప్రత్యర్థులతో ఆయన ఆడే రాజకీయ ఆట ఎంతలా ఉంటుందో తాజా సీన్ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.
దేశానికి కాపలాదారుడ్ని (చౌకీదార్) అంటూ తన గురించి చెప్పుకునే మోడీని ఉద్దేశించి.. కాంగ్రెస్ అధినేత చౌకీదార్ అంటూ మోడీ నినాదాన్ని పంచ్ రూపంలో మార్చి.. మరి ఈ కాపలాదారు మాల్యా.. నీరవ్ మోడీ లాంటి వారు దేశం విడిచిపోతుంటే ఏం చేశారు? ఈ చౌకీదార్ రాఫెల్ డీల్ విషయంలో ఏం చేశారంటూ రివర్స్ పంచ్ లు వేయటం మొదలెట్టారు.
రాహుల్ స్టార్ట్ చేసిన చౌకీదార్ పంచ్ తీవ్రత మొదట్లో పెద్దగా లేకున్నా.. రాన్రాను దాని తీవ్రత పెరగటం.. రాహుల్ నోటి నుంచి చౌకీదార్ అన్న మాట వచ్చినంతనే ప్రజల్లో వస్తున్న స్పందన కమలనాథుల్లో కంగారు పెంచింది. రాహుల్ వేస్తున్న చౌకీదార్ పంచ్ ను ఘాటైన పంచ్ వేయాలన్న దానిపై భారీగానే కసరత్తు చేసింది. తాజాగా.. రాహుల్ పంచ్ కు రివర్స్ పంచ్ ను కనుగొన్నారు ప్రధాని మోడీ.
రాహుల్ ఏ పదాన్ని పట్టుకొని తనపై విరుచుకుపడుతున్నారో.. అదే పదాన్ని తన పేరుకు ముందు పెట్టుకోవటం ద్వారా ఎదురుదాడికి దిగాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా చౌకీదార్ పేరును తమ పేర్ల ముందు పెట్టుకోవాలన్న మోడీ మాటకు.. బీజేపీ నేతలు ఫాలో కావటం.. ఇప్పుడీ వ్యవహారం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నేను కాపలాదారుడినే అంటూ ప్రత్యర్థి విసురుతున్న మాటకు.. అదే మాటతో సమాధానం చెప్పటం ద్వారా ఇష్యూను న్యూట్రల్ చేసే పనిలో పడ్డారు మోడీ.
తాజాగా ప్రధాని మోడీ మొదలు హోంమంత్రి రాజ్ నాథ్.. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా.. తదితర నేతలంతా తమ సోషల్ మీడియా ఖాతాల్లో తమ పేరుకు ముందు చౌకీదార్ పదాన్ని చేర్చుకోవటం ద్వారా రాహుల్ తమపై చేస్తున్న విమర్శలకు పరిహాసం చేసే కార్యక్రమాన్ని షురూచేశారు. కేవలం సోషల్ మీడియా ఖాతాల్లో తమ పేర్లకు ముందు కాపలాదారు అన్న పదాన్ని చేర్చటంతోపాటు.. ఐదేళ్ల పదవీ కాలంలో తాము చేసిన మంచి పనులంటూ కొన్ని బుల్లి వీడియోలను తయారు చేసి.. తాము దేశానికి కాపలాదారులమంటూ ముక్తాయిస్తున్నారు. దీంతో.. రాహుల్ చేసే నెగిటివ్ ప్రచారాన్ని తమ పాజిటివ్ ప్రచారంతో బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి చౌకీదార్ అస్త్రంతో మోడీని దెబ్బ తీయాలన్న రాహుల్ కు.. అదే అస్త్రంతో ఎదురుదాడికి దిగిన మోడీ బ్యాచ్ తీరు కాంగ్రెస్ కు మరో అస్త్రాన్ని వెతుక్కునేలా చేస్తుందని చెప్పక తప్పదు.