Begin typing your search above and press return to search.

జోరులో బీజేపీ.. మిఠాయిలేమో లాలూ ఇంటికి

By:  Tupaki Desk   |   8 Nov 2015 10:13 AM IST
జోరులో బీజేపీ.. మిఠాయిలేమో లాలూ ఇంటికి
X
దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచంలోని పలుదేశాల వారు ఎంతో ఆసక్తిగా చూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే సమయం అసన్నమైంది. తాజాగా బీహార్ వ్యాప్తంగా ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం షురూ కావటంతో పాటు.. మొదటిదశ ఓట్ల లెక్కింపు పూర్తి అవుతోంది. చాలా నియోజకవర్గాల్లో పూర్తి అయ్యింది కూడా. రెండో రౌండ్ ఫలితాలు కూడా కొన్నిచోట్ల వచ్చేశాయి.

ఫలితాల సరళి చూస్తే.. మొత్తం 243 స్థానాలకుగాను ఇప్పటివరకూ వెల్లడైన అధిక్యతను చూస్తే.. ఎన్డీయే అధిక్యత కొనసాగుతోంది. ఇప్పటివరకూ తొలి రెండు రౌండ్ల ఫలితాల్ని విశ్లేషిస్తే.. 114 స్థానాల అధిక్యతను పరిశీలిస్తే.. ఎన్డీయే 72 స్థానాల్లో అధిక్యంలో ఉంటే.. లౌకిక మహాకూటమి 38 స్థానాల్లో అధిక్యంలో ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైనట్లుగా రెండు కూటముల మధ్య పోటీ హోరాహోరీగా కాకుండా ఏకపక్షంగా సాగుతున్నట్లుగా ఉండటం గమనార్హం.

మరోవైపు.. ఫలితాల తొలిదశలో ఎన్డీయే పక్షం అధిక్యంలో ఉంటే.. గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తూ.. లౌకిక మహా కూటమికి చెందిన లాలూ ప్రసాద్ ఇంటికి ఆయన మద్దతుదారులు మిఠాయి బుట్టలతో వస్తున్నారు. విజయం ఏమో ఎన్డీయే వైపు అన్నట్లుగా తొలిదశ ఫలితాలు స్పష్టం చేస్తుంటే.. విజయం తమదేనంటూ లాలూ ఇంటికి మిఠాయి బుట్టలు రావటం విశేషం.