Begin typing your search above and press return to search.

మిత్ర‌ప‌క్ష శాపం..బీజేపీ ప్ర‌భుత్వం ప‌డిపోతుంది

By:  Tupaki Desk   |   20 March 2017 1:54 PM GMT
మిత్ర‌ప‌క్ష శాపం..బీజేపీ ప్ర‌భుత్వం ప‌డిపోతుంది
X
పేరుకు మిత్ర‌ప‌క్షాలే అయిన‌ప్ప‌టికీ బీజేపీ- శివ‌సేన‌ల మ‌ధ్య నిత్యం గిల్లిక‌జ్జాలు జ‌రుగుతూనే ఉంటాయి. మ‌హారాష్ట్రలో ప‌రిపాల‌న మొద‌లుకొని దేశ‌,విదేశీ విధాన‌ల వ‌ర‌కు బీజేపీని గిల్ల‌నిదే శివ‌సేన ఊరుకోదు. ఇదే రీతిలో తాజాగా గోవాలో ఇటీవ‌ల కొత్త‌గా ఏర్ప‌డిన బీజేపీ ప్ర‌భుత్వంపై త‌న కామెంట్లు వ‌దిలింది. రెండు ప్రాంతీయ పార్టీల‌తో క‌లిసి గోవాలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ తీరును శివ‌సేన త‌ప్పుప‌ట్టింది. ఆ క‌ల‌యిక అవినీతిభ‌రిత‌మైంద‌ని శివ‌సేన ప్ర‌తినిధి సంజ‌య్ రౌత్ విమ‌ర్శించారు. గోవాలో త్వ‌ర‌లో కుప్ప‌కూలుతుంద‌ని ఆయ‌న జోస్యం చెప్పారు.

కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా ఉన్న పారిక‌ర్ ఆ ప‌ద‌విని వ‌దిలేసి గోవాలో స్థిర ప్ర‌భుత్వ ఏర్పాటుకు పూనుకున్నార‌ని, తాను వేసిన అడుగు స్థిర‌మైంది కాద‌న్న విష‌యం ఆయ‌న‌కు తెలుసు అని, త్వ‌ర‌లోనే బీజేపీ కూట‌మి విడిపోతుంద‌ని సంజ‌య్ రౌత్ అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌జాతీర్పును బీజేపీ పార్టీ చోరీ చేసింద‌న్నారు. మ‌హారాష్ట్ర వాది గోమాంత‌క్ పార్టీ, గోవా ఫార్వ‌ర్డ్ లాంటి ప్రాంతీయ పార్టీల‌ను సైతం త‌ప్పుప‌ట్టారు. బీజేపీ వ్య‌తిరేక భావాల‌తో ఎన్నిక‌ల్లో పోటీ చేసి, ఆ త‌ర్వాత బీజేపీతో ఎలా పొత్తు పెట్టుకుంటార‌ని ప్రాంతీయ పార్టీలను ప్ర‌శ్నించారు. 13 సీట్లు గెలిచిన బీజేపీ, ప్రాంతీయ పార్టీల స‌హాకారంతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎంగా పారిక‌ర్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన విష‌యం తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/