Begin typing your search above and press return to search.
కేరళలో ఎల్డీఎఫ్ హిట్.. బీజేపీ మెట్రో మ్యాన్ ఫట్!
By: Tupaki Desk | 2 May 2021 2:36 PM GMTకేరళలో ప్రస్తుతం ఉన్న ఎల్డీఎఫ్ కూటమియే మరోసారి అధికారంలోకి వచ్చింది. కమ్యూనిస్టులకే కేరళ ప్రజలు పట్టం కట్టారు. కాంగ్రెస్ పార్టీ గట్టిగానే పోరాడిన విజయం దక్కలేదు. ఏకపక్షంగా మరోసారి ఎల్డీఎఫ్ కే ప్రజలు పట్టం కట్టారు.
మొత్తం 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో 99 స్థానాలను అధికార ఎల్డీఎఫ్ కైవసం చేసుకుంది. ఇక ప్రతిపక్ష యూడీఎఫ్ 41 స్థానాల్లో గెలుపొందింది. ఇక బీజేపీ కేరళలలో ఒక్కటంటే ఒక్క సీటును కైవసం చేసుకోకపోవడం విశేషం.
ఇక కేరళలో బీజేపీ తరుఫున సీఎం క్యాండిడేట్ గా ప్రకటించిన మెట్రో మ్యాన్ దారుణంగా ఓడిపోయాడు. మొదట లీడ్ లో కనిపించి ఆశలు రేపిన ఈయన చివరికి వచ్చేసరికి తేలిపోయాడు.
పాలక్కడ్ నుంచి బరిలోకి దిగిన బీజేపీ సీఎం అభ్యర్థి మెట్రో శ్రీధరన్ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి షఫీ పరంబిల్ చేతిలో 7,403 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
శ్రీధరన్ మెట్రో మ్యాన్‌గా గుర్తింపు పొందారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ సమక్షంలో ఫిబ్రవరిలో శ్రీధరన్ బీజేపీలో చేరారు. తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థి శ్రీధరన్ అని బీజేపీ అప్పట్లో ప్రచారం చేసింది. కానీ ఆయన కూడా ఓడిపోవడం బీజేపీకి గట్టి షాక్ ఇచ్చినట్టు అయ్యింది.