Begin typing your search above and press return to search.
బీజేపీ మేనిఫెస్టో విడుదల.. ముఖ్యాంశాలివీ
By: Tupaki Desk | 8 April 2019 10:56 AM GMT2019 తొలి దశ పోలింగ్ కు రెండు రోజుల ముందు బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసి అందరికీ సర్ ప్రైజ్ ను ఇచ్చింది. సోమవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీ - హోంమంత్రి రాజ్ నాథ్ - బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా - విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ లు పాల్గొని ‘సంకల్పయాత్ర’ పేరిట బీజేపీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. 59 పేజీలు ఉన్న మేనిఫెస్టోలు ప్రధానంగా వ్యవసాయం - విద్య - దేశభద్రత అంశాలకు ప్రాధాన్యమిచ్చారు.
తన నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీతోపాటు మరో 12 ఉప కమిటీలతో సంప్రదింపులు జరిపాకే మేనిఫెస్టో రూపకల్పన చేశామని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. బీజేపీ రూపొందించిన మేనిఫెస్టో 130 కోట్ల ప్రజలకు సంబంధించిందని వివరించారు.
+ మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు..
*రాజ్యాంగ విధి విధానాలకు లోబడి త్వరలోనే అయోధ్యలో అన్ని వర్గాల ఆమోదంతో రామ మందిర నిర్మాణం
*ఉమ్మడి పౌర స్కృతి - పౌరసత్వ సవరణ బిల్లులకు ఆమోదానికి చర్యలు
*60 ఏళ్లు నిండిన సన్న - చిన్నకారు రైతులకు పింఛన్ పథకం..
*కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఏటా రూ.6వేల కోట్ల ఆర్థికసాయం..
* వ్యవసాయ రంగానికి రూ.25లక్షల కోట్ల కేటాయింపు
*కిసాన్ క్రెడిట్ కార్డుపై లక్ష రూపాయల వరకు సున్నా వడ్డీతో రుణాలు
*2024 వరకు ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యం కింద ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల లేదా పీజీ వైద్య కళాశాల
*2014 నాటికి 200 కొత్త కేంద్రీయ విద్యాలయాలు.. నవోదయ విద్యాలయాలు
*ఎంబీబీఎస్ - స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య రెట్టింపు
* టాప్ 500 విద్యాస్థంస్థల్లో చోటు దక్కేలా అప్ గ్రేడ్
*1.5లక్షల ఆరోగ్య కేంద్రాల్లో టెలీ మెడిసన్ - డయాగ్నోస్టిక్ లాబోరేటరీ
*మెట్ర నెట్ వర్క్ కిందకు 50 నగరాలు
* రహదారుల నిర్మాణాలకు భారత్ మాలా 2.0
* ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ.50 లక్షల వరకు రుణాలు
* పార్లమెంట్ - రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్
* అంగన్ వాడీ - ఆశాలకు ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపు
* ట్రిపుల్ తలాక్ - నిఖా హలాల బిల్లుల ఆమోదం పొందేలా చర్యలు
*2022 నాటికి అందరికీ పక్కా ఇళ్లు
* ఉగ్రవాద నిర్మాళన కోసం చర్యలు.. జమ్మూ కాశ్మీర్ సమస్య పరిష్కారం..
* జమ్మూపై ఉన్న ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దుకు చర్యలు
* సైనిక దళాల బలోపేతం కోసం అత్యాధునిక ఆయుధాల కొనుగోల్లు
* దేశవ్యాప్తంగా దశలవారీ జాతీయ పౌరసత్వ నమోదు అమలు
*ఈశాన్యంలో చొరబాట్ల నియంత్రణకు చర్యలు