Begin typing your search above and press return to search.
కేసీఆర్ ను కొట్టాలి.. బీజేపీ మాస్టర్ ప్లాన్ ఇదే..
By: Tupaki Desk | 24 July 2019 8:40 AM GMTపార్లమెంట్ ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంట్ పేరిట రాజకీయం నెరిపిన తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఈజీగా వదలవద్దని కేంద్రంలోని బీజేపీ డిసైడ్ అయినట్లు సమాచారం. బీజేపీ నేతల మాటలను బట్టి అదే తేటతెల్లమవుతోంది. మరీ కేసీఆర్ ను ఎలా దెబ్బకొడుతారు? ఎవరి ద్వారా ఆయన పని పడుతారు? ఇప్పుడు ఇదే ప్రశ్న తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో గవర్నర్ నరసింహన్-సీఎం కేసీఆర్ జోడీ అద్భుతంగా కలిసికట్టుగా ముందుకుసాగింది. మొన్నటి తొలి తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ నిర్ణయాలకు అనుగుణంగా నరసింహన్ ఎంతో తోడ్పాటును అందించారు.. కానీ ఇప్పుడు కేసీఆర్ కు బీజేపీతో చెలిమి చెడిపోయింది. అందుకే గవర్నర్ తో కూడా కేసీఆర్ కు చెడిపోయింది. కేంద్రంలోని బీజేపీ ఆదేశాల మేరకే నరసింహన్ తన రూటు మార్చారన్న ప్రచారం సాగుతోంది. తాజాగా రాష్ట్ర బీజేపీ నేతలు వ్యతిరేకించి వినతిపత్రం ఇవ్వగానే తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి ఆమోదించిన మున్సిపల్ చట్టాన్ని గవర్నర్ తిరస్కరించి వెనక్కి పంపారు. దీని వెనుక పెద్ద కథే ఉందన్నప్రచారం సాగుతోంది.
మున్సిపల్ చట్టాన్ని తానే జాగ్రత్తగా రూపొందించానని.. అందులోని ప్రతీ పదం.. నిర్ణయం తనదేనని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పుకొచ్చాడు. అంతటి కేసీఆర్ రూపొందించిన చట్టాన్నే గవర్నర్ కాలదన్నడం వెనుక బీజేపీ పెద్దల హస్తం ఖచ్చితంగా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే మున్సిపల్ చట్టం పౌరుల హక్కులకు భంగం వాటిల్లేలా ఉందని.. పౌరసంస్థల అన్ని అధికారాలను చట్టంలో అధికారులకు కేసీఆర్ అప్పగించారని రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రంలోని హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. బండారు దత్తాత్రేయ నేతృత్వంలో గవర్నర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లును ఆమోదించవద్దని సూచించారు.
అందుకే మోడీషాల నుంచి వచ్చిన సూచనల మేరకే గవర్నర్.. తాజాగా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆ బిల్లును వెనక్కి పంపించాడనే ప్రచారం పొలిటికల్ వర్గాల్లో సాగుతోంది. ఇటీవలే అన్ని రాష్ట్రాల గవర్నర్లను మార్చిన మోడీ తెలంగాణ గవర్నర్ ను మాత్రం మార్చలేదు. ఇప్పుడు నరసింహన్ కొనసాగాలంటే తన స్నేహితుడైన కేసీఆర్ ను కేంద్రం ఆదేశాల మేరకు కార్నర్ చేయాలి.. అందుకే ఇప్పుడు నరసింహన్ ఫ్లేటు ఫిరాయించాడని టీఆర్ఎస్ వర్గాలు అనుమానిస్తున్నాయి.
ఇక రాబోయే రోజుల్లో ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య గ్యాప్ పెరుగుతుందని.. గవర్నర్ వ్యవస్థ ద్వారా టీఆర్ఎస్ సర్కార్ ను బీజేపీ ముప్పుతిప్పలు పెట్టడానికి రెడీ అయ్యిందన్న సూచనలు కనిపిస్తున్నాయి. మరి రాజకీయాల్లో ఆరితేరిన కేసీఆర్ దీన్ని ఎలా ఎదుర్కొంటాడో చూడాలి మరీ.