Begin typing your search above and press return to search.
బీజేపీ కర్ర తీసుకుని బాబును కొట్టాలట - జగన్ కు ఆఫర్
By: Tupaki Desk | 24 July 2019 5:30 PM GMTరాజకీయాల్లో వ్యూహాలు ఒక్కొక్కసారి చాలా సంచలనాలకు వేదికలుగా మారతాయి. తమకు నొప్పి లేకుండా ఎదుటి వారిని ఇరుకున పెట్టడంలో రాజకీయ పార్టీలు వేటికవే నాలుగు ఆకులు ఎక్కువ చదివాయి. ఈ వ్యవహారాల్లో తలపండిన కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ.. ఇప్పుడు ఏపీపై కన్నేసింది. రాష్ట్రంలో ఎదిగేందుకు ఉన్న అన్ని అవకాశాలను కూడా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు, ప్రస్తుత ప్రభుత్వాధినేతను, గత ప్రభుత్వాధినేతను కూడా ఇరుకున పెట్టేందు కు బీజేపీ నాయకులు చాలా వ్యూహాత్మంగా తమ చేతులకు మట్టి అంటకుండా ముందుకు సాగుతున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్.. అవినీతిపై యుద్ధాన్ని ప్రకటించారు. ఒక్కరూపాయి కాదు కదా.. ఒక్క పైసా కూడా అవినీతి జరగడానికి వీల్లేదని ఆయన ఖరాఖండిగా చెబుతున్నారు. అదేసమయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రాజెక్టుల నిర్మాణాల్లో చేసిన తప్పులు, చేతులు మారిన నోట్ల కట్టలపైనా దుమ్మురేపే రీతిలో జగన్ అవినీతిని వెలికి తీసేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే సౌర, పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని, చంద్రబాబు తనకు నచ్చిన ముగ్గురికి మాత్రమే ఈ ఒప్పందాల రూపంలో కోట్లకు కోట్లు దోచి పెట్టారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే వాటిని సమీక్షించేందుకు కూడా ఆయన నిర్ణయించారు.
అయితే, ఇలా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై విచారణ చేస్తామని ప్రకటించగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రంగంలోకి దిగిపోయింది. ఇది దేశానికే అరిష్టం.. ఎలా జరిగిందో అలాగే జరిగిపోనీ నువ్వు వేలు పెడితే.. దేశం మొత్తం దివాలా తీస్తుంది అని హెచ్చరించింది. అయినా ఇప్పుడు ఈ విషయంలో జగన్ ముందుకే పోతున్నారు. కేంద్రంతో మాట్లాడి అయినా ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. మరివిద్యుత్ ఒప్పందాల విషయంలో ఇలా వ్యాఖ్యానించి కాళ్లకు బంధం వేసిన.. కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఇప్పుడు చంద్రబాబు అవినీతికి సంబంధించిన అంశాలకు తమ వద్ద అనేక ఆధారాలు ఉన్నాయని వాటిని మీకు ఇస్తాం.. విచారణ చేయండి.. అంటూ.. బీజేపీ కీలక నేత దేవ్ ధర్ తాజాగా జగన్ కు సూచించారు.
నిజానికి మాజీ సీఎం చంద్రబాబు అవినీతికి పాల్పడి ఉంటే.. దానికి సంబంధించిన ఆధారాలు ఆయన వద్ద ఉండి ఉంటే. నేరుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతోనే విచారణ చేయించే వెసులుబాటు ఉంటుంది. పోనీ, న్యాయస్థానాన్ని ఆశ్రయించి విచారణకు ఆదేశించేలా చర్యలు తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. అయితే, వీటిని పక్కకు పెట్టి కేవలం రాజకీయంగా తమ చేతికి మట్టి అంటకుండా.. జగన్ వర్సెస్ చంద్రబాబు మధ్య మరింత మంటలు పెట్టి.. తద్వారా చలికాచుకోవాలని బీజేపీ వ్యూహాత్మకంగా ఇలా వ్యాఖ్యానిస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.