Begin typing your search above and press return to search.
బీజేపీ మాస్టర్ ప్లాన్ : ఒక భారత్...యాభై రాష్ట్రాలు...?
By: Tupaki Desk | 26 Jun 2022 4:30 AM GMTఈ దేశంలో ఈ రోజుకు 28 రాష్ట్రాలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ ని విడగొట్టి కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేశారు. లేకపోతే తెలంగాణాతో కలిపి 29 అయ్యేవి. అలాంటి ఈ నంబర్ ని దాదాపుగా డబుల్ చేసే మాస్టర్ ప్లాన్ తో బీజేపీ ఉందా అంటే అవును అని అదే పార్టీకి చెందిన కీలక నేతలు అంటున్నారు. ఏకంగా కర్నాటక రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉమేశ్ కత్తి దీని మీద తాజాగా సంచలన కామెంట్స్ చేశారు.
ఈ విషయం మీద ప్రధాని నరెంద్ర మోడీ సీరియస్ గా చర్చిస్తున్నారు అని ఆయన అన్నారు. ఈ లెక్కన కర్నాటకలో రెండు, ఉత్తరప్రదేశ్ లో నాలుగు, మహారాష్ట్రలో మూడు కొత్తగా రాష్ట్రాలుగా ఏర్పడుతాయని చెప్పుకొచ్చారు. ఉత్తర కర్నాటక రాష్ట్రం అలా ఏర్పడి తీరుతుందని, దాని కోసం ఇప్పటి నుంచే పోరాటం చేయాల్సి ఉందని కూడా ఆయన చెప్పడం విశేషం.
దీన్ని కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కొట్టిపారేసినా కూడా ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత సిద్ధ రామయ్య మాత్రం ఈ విషయంలో వాస్తవాలు బయటకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. కర్నాటకను విడగొడితే ఊరుకునేది లేదు అని కూడా చెప్పుకొచ్చారు. ఈ రాజకీయ రచ్చ సంగతి ఎలా ఉన్నా బీజేపీ అజెండాలో చిన్న రాష్ట్రాలు ఉన్నాయి అన్నది నిజం.
దేశంలో చిన్న రాష్ట్రాలు ఉంటే తమ రాజకీయ సులువు అవుతుందని బీజేపీ భావిస్తోంది. దానిని తమకు అనుకూలంగా చేసుకుంటే చిన్న రాష్ట్రాలు బలహీన ముఖ్యమంత్రులతో దేశంలో తాము జాతీయ పార్టీగా పటిష్టంగా ఉండవచ్చు అన్నది కూడా బీజేపీ ప్లాన్ అని అంటున్నారు. ఏపీ తెలంగాణా విడిపోయాక ఢిల్లీలో పలుకుబడి తగ్గింది. అంతే కాదు తాజాగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఒకరు మద్దతు ఇచ్చారు కూడా. అదే ఉమ్మడిగా ఏపీ ఉంటే ఇది వీలు అయ్యేది కాదు కదా అన్న విశ్లేషణలు ఉన్నాయి.
ఇక బీజేపీ యాభై రాష్ట్రాలు అంటోంది. అంటే మరో 21 రాష్ట్రాలు కొత్తగా వస్తాయి. అవి ఏంటి అంటే కర్నాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లను విడగొట్టి తొమ్మిది కొత్త రాష్ట్రాలు చేస్తారు. అలాగే తమిళనాడు తో పాటు ఏపీలోని రాయలసీమ, తెలంగాణాను ఉత్తర దక్షిణ తెలంగాణాలుగా విడగొట్టి కొత్త రాష్ట్రాలుగా చేయవచ్చు అని అంటున్నారు. అదే విధంగా పశ్చిమ బెంగాల్ ని మూడు రాష్ట్రాలుగా చేసే ప్రతిపాదన ఉందిట.
ఇలా చూసుకుంటే బీహార్, మధ్య ప్రదేశ్ సహా పెద్ద రాష్ట్రాలు ఇక మీదట చిన్నవిగానే కనిపిస్తాయని అంటున్నారు. ఇలా చిన్న రాష్ట్రాలు ఉండడం వల్ల రాజకీయ బలం వీక్ అయి విపక్షాలు తగ్గి ఉంటాన్న దూరాలోచన ఉంది అంటున్నారు. 2024లో మోడీ మూడవసారి ప్రధాని అయ్యాక భారత్ యాభై రాష్ట్రాలుగా మారుతుంది అంటున్నారు. అంటే అమెరికాకు యాభై రాష్ట్రాలు ఉన్నట్లు అన్న మాట. చూడాలి మరి ఏం జరుగుతుందో.