Begin typing your search above and press return to search.
ఈసారి అసద్ కు చుక్కలేనట!
By: Tupaki Desk | 26 July 2018 6:23 AM GMTమోడీ.. దమ్ముంటే హైదరాబాద్ లోక్ సభ స్థానానికి రా. అక్కడి నుంచి పోటీ చేసి గెలువు చూద్దామంటూ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ విసిరిన సవాల్ సంచలనం సృష్టించింది. బీజేపీకి అంతా తానైనట్లుగా వ్యవహరించే మోడీకే సవాల్ విసిరిన అసద్‌కు దిమ్మ తిరిగేలా.. మోడీ దాకా ఎందుకు? ముందు మా పార్టీ నేతతో పోటీ పడు చూద్దామన్నట్లుగా పక్కా ప్లాన్ ను కమలనాథులు సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు.
ఎన్నికలు ఎప్పుడు జరిగినా హైదరాబాద్ పార్లమెంటు స్థానం తనదేనన్న ధీమాను వ్యక్తం చేసే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటివరకూ నాలుగుసార్లు నాన్ స్టాప్ గా గెలుపొందారు. దేశంలో మిగిలిన లోక్ సభ స్థానాల సంగతి ఎలా ఉన్నా.. హైదరాబాద్ ఎంపీ స్థానంలో మాత్రం తనను తప్పించి మరెవరూ ఉండరన్నట్లుగా వ్యవహరించే అసద్ కు ఈసారి గడ్డు పరిస్థితి తప్పదని చెబుతున్నారు.
అసద్ కు షాకిచ్చేందుకు లోకల్ టాలెంట్ అయిన బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజా సింగ్ ను రంగంలోకి దింపేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. ముస్లిం ఓట్లే ఆయుధంగా గెలుస్తూ వస్తున్న ఓవైసీని ఢీ కొట్టేందుకు హిందుత్వ వాదిగా సుపరిచితుడు.. బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఎంపీగా బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
మోడీకి సవాలు విసిరిన అసద్ కు ఈసారి చుక్కలు చూపించాలని భావిస్తున్న బీజేపీ నేతలు.. భారీ కసరత్తు చేసి రాజాసింగ్ ను హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా దింపాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులుగా బరిలోకి దిగిన బద్దం బాల్ రెడ్డి.. వెంకయ్యనాయుడు లాంటి అగ్రనేతలు హైదరాబాద్ లో అసద్ కు గట్టి పోటీనే ఇచ్చారు. స్వల్ప వ్యత్యాసంలో ఓడిపోయారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సరైన నాయకుడ్ని బరిలోకి దింపి.. జాగ్రత్తగా పోల్ మేనేజ్ మెంట్ మీద దృష్టి సారిస్తే అసద్ మీద గెలుపు పెద్ద కష్టం కాదన్న వాదన వినిపిస్తోంది. ఇటీవల హైదరాబాద్ పర్యటన సందర్భంగా రాజాసింగ్ కు అపాయింట్ మెంట్ ఇచ్చిన అమిత్ షా.. హైదరాబాద్ ఎంపీ స్థానానికి పోటీకి దిగేందుకు సిద్ధంగా ఉండాలన్న మాటను ఆయనకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ.. బీజేపీ నేతల వ్యూహం ఫలిస్తే మాత్రం అదో సంచలనంగా మారుతుందనటంలో సందేహం లేదని చెప్పక తప్పదు.