Begin typing your search above and press return to search.
బీజేపీ అంటే మోడీనే... ఎనీ డౌట్స్...?
By: Tupaki Desk | 20 Aug 2022 2:30 AM GMTఇందిర అంటే ఇండియా అని నాడు ఒక నినాదాన్ని భక్తి తలకెక్కి వ్యక్తిగత పూజ శృతి మించి కాంగ్రెస్ నాయకులు జనాలకు ఎక్కించారు. అయితే అది వారి మెదళ్ళలో పూర్తిగా జొప్పించలేకపోయారు. కాబట్టే ఇందిర బతికుండగానే ఆమెను మాజీని చేసి జనతా పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఇక ఇపుడు బలమైన ప్రధానిగా చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ ఉన్నారు. బీజేపీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ. సిద్ధాంతాల కోసం ఎక్కడా రాజీపడని పార్టీ కూడా బీజేపీనే.
అలాంటి పార్టీలో మోడీ ప్రధాని అయ్యాక అన్నింటికీ తిలోదకాలు ఇచ్చేస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. తేడా గల పార్టీ అని గర్వంగా చెప్పుకునే బీజేపీలో తేడా పాడాలు లేవు అంతా ఆ తానులో ముక్కలమే అని మోడీ షా ద్వయం పూర్తిగా బయటకు చెప్పేస్తున్నారు అని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇక బీజేపీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఉన్న సుబ్రమణ్య స్వామి ఈ మధ్యనే పదవీ విరమణ చేసారు. ఆయన బీజేపీలో మోడీకి ఎపుడూ ఎదురు నిలిచే మాట్లాడుతూ వచ్చారు.
ఆయన మోడీ ఆర్ధిక విధానాలను తూర్పారా పడుతూ వచ్చారు. మోడీ ఏలుబడిలో దేశంలో ప్రగతి ఏదీ అని ప్రశ్నించి సొంత పార్టీలోనే విపక్ష నేతగా మారరు. ఆయన మాజీ ఎంపీ కాగానే మరింత స్వేచ్చతో మోడీ మీద విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆయన మోడీయే బీజేపీ అని అక్కడ సంస్థాగత వ్యవస్థ వేరేది లేదని అంటూ ఘాటు విమర్శలు చేశారు.
బీజేపీలో ఇక సంస్థాగత ఎన్నికలు ఉండవు. అంతా మోడీయే అని హాట్ హాట్ కామెంట్స్ చేశారు. మోడీ అనుకున్న వారే బీజేపీ పార్లమెంటరీ బోర్డులోకి నామినేట్ అవుతున్నారు అని కూడా ఆయన విసుర్లు విసిరారు. మోడీ సర్వస్వంగా పార్టీ మారిపోయింది అని ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు బీజేపీలో పార్లమెంటరీ బోర్డు మెంబర్ షిప్ కి ఎన్నికలు జరిగేవని ఆయన గుర్తు చేశారు. ఆ ప్రజాస్వామిక వాతావరణం నేడు లేదు అంటూ మోడీ రాజ్యం అంతా అన్నట్లుగా మాట్లాడారు.
ఒక విధంగా చెప్పాలీ అంటే పార్టీ నియమ నిబంధనలు కూడా తోసిరాజని మోడీ అంతా తానే అని నామినేట్ చేస్తున్నారు అని కూడా విమర్శించారు. అయితే దీని మీద బీజేపీ అంతే ఘాటుగా స్పందించింది. బీజేపీలో మోడీ కాదని, పార్టీ ప్రెసిడెంట్ ఆమోదంతోనే నియామాకలు జరుగుతాయని, వాటిని పార్టీ జాతీయ కార్యవర్గం కానీ ఇతర విభాగాలు కానీ ఆమోదిస్తాయని బీజేపీ పేర్కొంది.
ఈ మధ్యనే బీజేపీ పార్లమెంటరీ బోర్డును పునర్ వ్యవస్థీకరించారు. అందులో నితిన్ గడ్కరీని, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ చౌహాన్ ని తప్పించి కొత్తగా ఆరుగురుని తీసుకున్నారు. దాంతోనే రచ్చ సాగుతోంది. అయితే ఇది బీజేపీ అంతర్గత వ్యవహారం అయినా సరే పార్టీ ప్రజాస్వామ్యం మీదనే అంతా చర్చ చేస్తున్నారు. ఈ నియామకాలు తొలగింపుల వెనక మోడీ హ్యాండ్ ఉందని అంటున్నారు. దాని మీదనే స్వామి కూడా ఆరోపిస్తున్నారు. అంటే స్వామి చెప్పినట్లుగా చూస్తే బీజేపీలో అంతా మోడీయే అన్న మాట.