Begin typing your search above and press return to search.
పాక్ జిందాబాద్ అంటే కాల్చిపారేయాల్సిందే : బీజేపీ ఎమ్మెల్యే
By: Tupaki Desk | 25 Feb 2020 5:30 PM GMTగత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ బిల్లుని ముస్లిమ్స్ వ్యతిరేకిస్తున్నారు. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని వారు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అలాగే ఈ చట్టానికి మద్దతుగా కొందరు ర్యాలీలు కూడా చేస్తున్నారు. అయితే , ఇదే సమయంలో కొంతమంది ఇండియా లో ఉంటూ ..పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు.
ఈ మద్యే " సేవ్ కాన్సిస్టిట్యూషన్’ పేరుతో గత వారం బెంగుళూరులో జరిగిన సీఏఏ నిరసన సభలో అమూల్య లియోన్ అనే యువతి ‘పాకిస్తాన్ జిందాబాద్’ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మరికొందరు నాయకులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలకి గాను, అమూల్యపై దేశద్రోహం కేసు నమోదైంది. ఆ తరువాత కోర్టు ఆమెకి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
ఈ నేపథ్యంలో తాజాగా కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అప్పచ్చు రంజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏ నిరసనల పేరుతో పాకిస్తాన్ జిందాబాద్ అంటున్న వారిని కాల్చి చంపేందుకు కొత్త చట్టం తేవాలని, లేదంటే అలాంటి వారిని పాకిస్తాన్ కు పంపించాలని కోరారు. భారత్‌లో ఉంటూ.. ఇక్కడి తిండి తింటూ.. పాకిస్తాన్ పాట పాడేవాళ్లను కాల్చి చంపాలి. లేదంటే వారిని పాకిస్తాన్ కు తరిమేయాలి. అలాంటి వారిపట్ల సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. వారిపై నమోదైన కేసుల విషయంలో కూడా ఉదారత అవసం లేదు అని కొడగులో సోమవారం ఆయన అన్నారు. అలాగే కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రి బీసీ పాటిల్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసారు. పౌర నిరసనకారులు, పాకిస్తాన్ జిందాబాద్ కామెంట్లు చేసేవారిని కనిపిస్తే కాల్చడానికి ఆర్డర్స్ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకు రావాలని , ఈమేరకు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తానని అయన తెలిపారు.