Begin typing your search above and press return to search.

మహిళను తన్నిన బీజేపీ ఎమ్మెల్యే.. వైరల్

By:  Tupaki Desk   |   3 Jun 2019 10:32 AM GMT
మహిళను తన్నిన బీజేపీ ఎమ్మెల్యే.. వైరల్
X
రెండోసారి అధికారంలోకి రావడంతో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో కాసింత అహంకారం పెరిగిపోయినట్టు కనిపిస్తోంది. మహిళ అని కూడా చూడకుండా కాలితో తన్నిన బీజేపీ ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సమస్యలు పరిష్కరించమని వచ్చిన మహిళపై దాడి చేసిన ఎమ్మెల్యే వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

గుజరాత్ రాష్ట్రంలోని నరోడాలో నీత్ తేజ్ వానీ అనే నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళపై బీజేపీ ఎమ్మెల్యే బలరామ్ దాడికి పాల్పడ్డాడు. నరోడాలో మంచినీటి సరఫరా విషయమై మహిళ నిరసన వ్యక్తం చేసింది. ఇదే విషయమై ఎమ్మెల్యే బలరాంతో మాట్లాడేందుకు నీత్ తేజ్ వెళ్లింది. ఆ సమయంలో సీరియస్ అయిన ఎమ్మెల్యే బలరాం ఆమెపై భౌతిక దాడి చేశారు.కాలితో తన్నాడు. ఎమ్మెల్యే కార్యాలయం వద్ద తన అనుచరులతో పాటు ఎమ్మెల్యే కూడా ఈ దాడికి పాల్పడ్డట్టు ఆమె ఆరోపించింది.

మహిళపై దాడి చేసినప్పుడు ఆమె భర్త రక్షించేందుకు ప్రయత్నించగా.. ఎమ్మెల్యే అనుచరులు ఆయనను చితకబాదారు. ఈ ఘటనను అక్కడే ఉన్న స్థానికులు కొందరు వీడియో తీయడంతో సోషల్ మీడియాలో పెట్టడంతో బీజేపీ ఎమ్మెల్యేపై నెటిజన్లు దుమ్మెత్తిపోశారు.

మీడియాలోనూ ఈ వీడియో హైలెట్ కావడంతో ఎమ్మెల్యే బలరామ్ దిగివచ్చాడు. తప్పు జరిగిందని.. ఉద్దేశపూర్వకంగా జరగలేదని.. సదురు బాధిత మహిళలకు క్షమాపణలు చెప్పారు. ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ఖండించింది. బీజేపీ ఎమ్మెల్యే దురంహకారాన్ని నిలదీసింది.