Begin typing your search above and press return to search.

మిడతల బుట్టతో అసెంబ్లీకి హాజరైన ఎమ్మెల్యే..ఎందుకంటే!

By:  Tupaki Desk   |   24 Jan 2020 12:42 PM GMT
మిడతల బుట్టతో అసెంబ్లీకి హాజరైన ఎమ్మెల్యే..ఎందుకంటే!
X
ఈ సువిశాలమైన భారదేశంలో ఎవరైనా ఏ విషయంలో అయినా కూడా తమ నిరసనని తెలియజేయచ్చు. నిరసన తెలపడం అనేది ప్రజల హక్కు. దాన్ని ఆపమనే హక్కు న్యాయస్థానాలకు కూడా లేదు. అలాగే ప్రజలతో పాటుగా ప్రజాపతినిధులు కూడా తమ నిరసన వ్యక్తం చేస్తుంటారు. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాల పట్ల ప్రతిపక్ష పార్టీలకి చెందిన కొంతమంది నేతలు ..ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా తమ నిరసన తెలుపుతుంటారు. చట్ట సభల్లో ఎమ్మెల్యేలు - ఎంపీలు రకరకాలైన పద్దతుల్లో తమ ఆవేదనను వ్యక్తపరుస్తూ ఉంటారు.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన మాజీ ఎంపీ - దివంగత శివప్రసాద్ ప్రత్యేక హోదాని అమలు చేయాలనీ కేంద్రాన్ని కోరుతూ పార్లమెంట్ ఆవరణలో రోజుకో వేషధారణ తో నిరసన తెలియజేసారు. అయన ఈ ఒక్క సందర్భంలోనే కాదు చాలా సందర్భాల్లో విచిత్ర వేషధారణలతో తన నిరసన ప్రభుత్వానికి తెలియజేసారు. అదే విదంగా , తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే కూడా వినూత్న రీతిలో నిరసనను తెలుపుతూ వైరల్ గా మారాడు. అయన మిడతల బుట్ట తో అసెంబ్లీ కి హాజరై రైతులకి మద్దతుగా , వారికీ వెంటనే నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతూ తన నిరసనని తెలియజేసారు.

పూర్తి వివరాలు చూస్తే ..బిజెపి ఎమ్మెల్యే బిహారీ లాల్ నోఖా శుక్రవారం రాజస్థాన్ అసెంబ్లీకి మిడతల బుట్టతో వెళ్లారు. ఈ మద్యే పాకిస్థాన్‌ లోని ఎడారి ప్రాంతం నుంచి భారీ స్థాయిలో వచ్చిన మిడతలు గుజరాత్ - రాజస్థాన్ రాష్ట్రాలలోని పంటలపై దాడి చేసిన విషయం తెలిసిందే. చేతికి అందివచ్చిన పంటల్ని మిడతలు నాశనం చేయడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. లక్షల హెక్టార్లలో పంట నాశనమైంది. దీంతో ఎమ్మెల్యే బిహారీ రైతుల ఆవేదనను అద్దం పట్టేందుకు మిడదలతో అసెంబ్లీకి వచ్చారు. వారికీ వెంటనే తగిన విదంగా సాయం చేయాలనీ డిమాండ్ చేశారు.

ఈ సమస్య పైనే ఈ నెల ప్రారంభంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బార్మర్ రాష్ట్ర రైతులను కలుసుకున్నారు. ఆ సమయంలో రైతులందరూ కూడా ఈ స్థాయిలో పంటలు నాశనమవ్వడం రెండు దశాబ్దాలలో ఇదే మొదటిసారి అని తమ ఆవేదనని చెప్పుకున్నారు. ఆ సమయంలో సీఎం మాట్లాడుతూ ... వ్యవసాయ కార్యదర్శి కె.ఎస్. పన్ను పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అని , రాజస్థాన్ వ్యవసాయ నిపుణులతో పాటు భారత ప్రభుత్వంతో కూడా నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని కాగా ఈ నెల ప్రారంభంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బార్మర్ రైతులను కలుసుకున్నారు. ఈ స్థాయిలో పంటలు నాశనమవ్వడం రెండు దశాబ్దాలలో ఇదే మొదటిసారి అని రైతులు ఆయన ముందు వాపోయారు. వ్యవసాయ కార్యదర్శి కె.ఎస్. పన్ను పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రాజస్థాన్ వ్యవసాయ నిపుణులతో పాటు భారత ప్రభుత్వంతో కూడా నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని భయపడవద్దని రైతులు ఎవరూ భయపడాల్సిన పనిలేదు అని భరోసానిచ్చారు.