Begin typing your search above and press return to search.
హైకోర్టు మెట్లు ఎక్కిన దుబ్బాక ఎమ్మెల్యే .. ఏమైందంటే !
By: Tupaki Desk | 12 Nov 2020 3:10 PM GMTతెలంగాణలో తాజాగా జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ ఎస్ పార్టీకి తొలిసారి ఓటమిని రుచి చూపించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సిద్దిపేట ఘటనపై హైకోర్టును ఆశ్రయించారు. సిద్దిపేటలో నమోదైన ఎఫ్ ఐ ఆర్ కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రూ.18 లక్షలు దొరికాయంటూ కట్టు కథ అల్లారని రఘునందన్ రావు పిటిషన్ లో పొందుపరిచారు. ఎమ్మెల్యే రఘనందన్ పిటిషన్ జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ వద్దకు రాగా, ఎమ్మెల్యేల పై క్రిమినల్ కేసులను సీజే ధర్మాసనం విచారణ జరపాల్సి ఉంటుందని సూచించారు.
ఈ కేసు విచారణను ప్రధాన న్యాయపూర్తి ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీకి జస్టిస్ లక్ష్మణ్ ఆదేశాలు జారీ చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రఘునందన్‌రావు మామ అంజన్‌రావు ఇంట్లో సెర్చ్ చేశారు. అంజన్‌రావు ఇంట్లో రూ.18.67 లక్షలు పట్టుబడ్డాయని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. రఘునందన్ అనుచరులు రూ.12.80 లక్షలు ఎత్తుకెళ్లారని తెలిపారు. 30 మందిని గుర్తించామని, వారిపై కేసులు నమోదు చేస్తామని జోయల్ డేవిస్ పేర్కొన్నారు. అయితే ఈ డబ్బులు పోలీసులే తీసుకొచ్చి అక్కడ పెట్టి డబ్బులు దొరికాయని బీజేపీ శ్రేణులు ఆరోపించగా.. ఆ డబ్బంతా రఘునందన్ రావుదే అని టీఆర్ ఎస్ ప్రచారం చేసింది.