Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యే రాజాసింగ్ కు 35% బామ్మర్ధులున్నారా?
By: Tupaki Desk | 18 Jan 2020 5:16 AM GMTతెలంగాణలో గెలిచిన ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఆయన హిందుత్వ వాదంతోనే గెలిచారు. అదే కొనసాగిస్తున్నారు. పక్కా హిందుత్వ వాదిగా ఎంఐఎం అంటే గిట్టని మనిషి. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో అదే ఎంఐఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎంఐఎంపై చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి..
భుపాలపల్లి జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీజేపీ నిర్వహించిన ప్రచార ర్యాలీలో పాల్గొన్న రాజాసింగ్ ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో 150 వార్డులుంటే అందులో 35శాతం స్థానాల్లో ఎంఐఎం బామ్మర్ధులే అధికారంలో ఉన్నారని.. వారు గెలిచిన వార్డుల్లో ఏమాత్రం అభివృద్ధి జరిగిందో చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
ఎంఐఎం అభ్యర్థులను బామ్మర్ధులంటూ రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపాయి. హిందుత్వవాదంతో చెలరేగిపోయిన రాజాసింగ్ పై ఇప్పటికే రౌడీ షీట్ నమోదైంది. అయినా దూకుడు తగ్గించకుండా నోరు పారేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యలకు ఎంఐఎం ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి మరీ..