Begin typing your search above and press return to search.
యూపీ బుల్డోజర్లు.. తెలంగాణకూ వస్తాయ్: రాజాసింగ్ హెచ్చరిక
By: Tupaki Desk | 10 March 2022 1:11 PM GMTయూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం దిశగా బీజేపీ దూసుకెళుతోంది. సుమారు 250కు పైగా సీట్లు సాధించి ఎవరి సపోర్టు లేకుండా యూపీలో బీజేపీ అధికారం చేపట్టేలా ఉంది. యూపీ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరడంపై బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్ హర్షం వ్యక్తం చేశారు. తనదైన స్టైల్లో స్పందించారు. ఉత్తరప్రదేశ్ లో కాషాయదళం విజయంపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తనదైన స్టైల్లో స్పందించారు.
యూపీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయకపోతే ఇళ్లకు బుల్డోజర్లు పంపిస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసి కాకరేపిన ఎమ్మెల్యే ఈసారి ఆ బుల్డోజర్లు తెలంగాణకు వస్తాయంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. యూపీ బుల్డోజర్లు తెలంగాణకు వస్తాయని.. వచ్చే ఎన్నికల్లో అవే ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయని రాజాసింగ్ అన్నారు.కేసీఆర్ కుటుంబం అవినీతి, కుటుంబ పాలనను బుల్డోజర్లతో తొక్కించేస్తామన్నారు. కేసీఆర్ కలలో కి కూడా మోడీ వస్తున్నారని.. సీఎం ఉలిక్కిపడుతున్నాడని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ దేశంలో కనిపించకుండా పోతోందని.. తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని రాజాసింగ్ అన్నారు. ఎంఐఎం తమకు శత్రువు అని.. బీజేపీతో దోస్తీ అనేది కేవలం ప్రచారం మాత్రమేనన్నారు.
యూపీలో దౌర్జన్యాలు, అన్యాయాలపై యోగి ఆదిత్యనాథ్ ఉక్కుపాదం మోపాడని రాజాసింగ్ అన్నారు. ప్రజాసంక్షేమానికి యోగి కృషి చేశాడన్నారు. యూపీ ఎన్నికల ప్రచారం వేళ రాజాసింగ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. యూపీలో ఉండాలంటే యోగి అనాల్సిందేనని.. బీజేపీకి ఓటేయకపోతే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.