Begin typing your search above and press return to search.
పోలీసును కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే
By: Tupaki Desk | 18 Aug 2016 9:05 AM GMTమహారాష్ట్రలో ప్రజాప్రతినిధులు జోరు మీదున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా రెచ్చిపోతుండడం అక్కడి కుర్ర సీఎం ఫడ్నవీస్ కు తలనొప్పులు తెస్తోంది. మొన్న ఆ రాష్ట్రంలోని ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యే ప్రభుత్వ కార్యాలయంలోకి వెళ్లి డిప్యూటీ కలెక్టర్ చెంప చెళ్లుమనిపించిన ఘటన మర్చిపోకముందే తాజాగా బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే కూడా ఇలాంటి దుందుడుకు ధోరణితో వివాదం రేపారు. బీజేపీ ఎమ్మెల్యే ఏకంగా పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఓ పోలీసును చెంప పగలగొట్టడం వివాదాస్పదమైంది.
బుధవారం రాత్రి మహారాష్ర్టలోని బంధారా ఎమ్మెల్యే రామచంద్ర పూనజ్ అక్కడి పోలీసు స్టేషన్ కు వెళ్లి ఓ పోలీసు కొట్టారు. ఆ సమయంలో ఎమ్మెల్యే మద్యం మత్తులో ఉన్నట్లుగా చెబుతున్నారు. పోలీసు స్టేషనుకు ఎమ్మెల్యే వెళ్లగానే అక్కడున్న పోలీసు అధికారి ఆయన్ను కూర్చోబెట్టి ఎందుకొచ్చారో అడగబోయారు. కానీ... అంతలోనే రామచంద్ర.. స్టేషన్లోని ఓ పోలీసుతో తనకు ఇబ్బందులు వస్తున్నాయంటూ ఆయన్ను పిలిపించారు. సదరు పోలీసు రాగానే ఇంకేమీ మాట్లాడకుండా ఒక్కసారిగా ఆయన చెంప చెళ్లుమనిపించారు. వెంటనే తేరుకున్న పోలీసు అధికారి ఎమ్మెల్యేను శాంతపరిచారు.
కానీ ఈ మొత్తం వ్యవహారాన్ని ఎవరో వీడియో తీశారు. అంతేకాదు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది ఇదిప్పుడు వైరల్ గా మారిపోయింది. తమ పార్టీ ఎమ్మెల్యే ఇలా ప్రభుత్వ ఉద్యోగిని కొట్టడంతో సీఎం ఫడ్నవీస్ ఇరకాటంలో పడ్డారు. ఎమ్మెల్యేలను అదుపు చేయలేకపోతున్నారంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.