Begin typing your search above and press return to search.
పిల్లలను ఎందుకు కంటున్నారు .. బీజేపీ ఎమ్మెల్యే !
By: Tupaki Desk | 2 March 2021 7:30 AM GMTయూపీ కి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రమేష్ దివాకర్ కుటుంబ నియంత్రణ పై, అలాగే మహిళలు అన్న గౌరవం కూడా లేకుండా, తానొక ప్రజా ప్రతినిధిని అన్న సంగతి కూడా మర్చిపోయి మహిళలతో అసభ్యంగా మాట్లాడారు. ఓ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే రమేష్ దివాకర్ ను ఆ సమావేశానికి హాజరైన మహిళల బృందం ప్రైవేట్ స్కూల్స్ లో భారీగా ఫీజులు లాగేస్తున్నారంటూ ఫీజు మినహాయింపు చేయాలని కోరింది. ఇది ఎవరైనా అడిగే సాధారణ విషయమే..దీనిపై సున్నితంగా స్పందించాల్సింది పోయి, అసలు మీరు ఎందుకు పిల్లలను కంటున్నారు, మీరు పిల్లలను కంటే, వారి బడి ఫీజు ప్రభుత్వం భరించాలా అంటూ ఫైర్ అయ్యారు. అలాగే ప్రభుత్వ స్కూళ్లు ఉన్నాయి కదా, అక్కడికి పంపండి అన్ని అక్కడ ఉచితమే అంటూ మరో ఉచిత సలహా ఇచ్చారు.
ఎమ్మెల్యే వ్యాఖ్యలు విన్న ఆ మహిళా బృందంలోని ఓ మహిళ .. మీరు కూడా మేము ఓట్లు వేస్తే గెలిచిన ఎమ్మెల్యే అని మర్చిపోకండి అంటూ ఘాటుగా స్పందించింది. ప్రైవేట్ స్కూళ్ల ఆగడాలు అరికట్టండి అయ్యా అని అడిగితే , దానికి సమాధానం చెప్పాల్సింది పోయి , మీరు పిల్లలను ఎందుకు కంటున్నారు. మీరు పిల్లలను కంటే..బడి ఫీజు ప్రభుత్వం కడుతుందా అని ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా .. ప్రభుత్వ స్కూళ్ల లో చేర్పించండి అని ఉచిత సలహా ఒకటి. అసలు ప్రభుత్వ స్కూళ్ల ల్లో విద్యా భోధన సరిగ్గా ఉంటే .. తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ల వైపు ఎందుకు తొంగి చూస్తారు. అసలు ప్రభుత్వ స్కూళ్లల్లో చేర్పించండి అని చెప్పిన ఎమ్మెల్యే గారు .. ప్రైవేట్ స్కూళ్ల ను రద్దు చేసి..ప్రైవేట్ తరహా లో ప్రభుత్వ స్కూళ్లల్లో బోధన ఉండేలా చేస్తే అందరూ ప్రభుత్వ స్కూళ్లల్లోనే తమ పిల్లలని చేర్పిస్తారు కదా. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్ల ఆగడాలు అరికట్టాల్సింది పోయి , ఫీజు మినహాయింపు అడిగిన మహిళల బృందం పై ఎమ్మెల్యే ఈ తరహా వ్యాఖ్యలు చేయడం నిజంగా సిగ్గు చేటు అని అన్నారు. అలాగే పిల్లలను కనేది కూడా ప్రభుత్వాన్ని అడిగి పర్మిషన్ తీసుకోని కనాల అని ప్రశ్నిస్తున్నారు.