Begin typing your search above and press return to search.
కానిస్టేబుల్ ను కొట్టిన బీజేపీ ఎమ్మెల్యే
By: Tupaki Desk | 9 Jun 2018 7:28 AM GMTక్రమశిక్షణ కలిగిన పార్టీగా పేరున్న బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధులు పలువురు వివాదాస్పద అంశాలతో తెర మీదకు వస్తున్నారు. దురుసు ప్రవర్తనతో బీజేపీ ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యప్రదేశ్ లోని దేవాస్ జిల్లా భాగ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే చంపాలాల్ వైఖరిని పలువురు తప్పు పడుతున్నారు.
అర్థరాత్రి వేళ పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. అక్కడి కానిస్టేబుల్ చెంపలు వాయించేశారు. ఎందుకిలా చేశారంటే.. శుక్రవారం రాత్రి ఉదయ్ నగర్ పోలీస్ స్టేషన్ కు ఎమ్మెల్యే మేనల్లుడు వచ్చాడు. అక్కడున్న అధికారి గదిలోకి వెళ్లి అక్కడి నీళ్ల బాటిల్‌ను తీసుకున్నాడు. ఎవరి అనుమతి లేకుండా లోపలికి వెళ్లిపోయి.. వ్యవహరించిన తీరుపై అక్కడి పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు.
దీంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన మేనల్లుడు.. తన మేనమామ కమ్ ఎమ్మెల్యే దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. రాత్రి వేళ స్టేషన్ కు వచ్చిన ఎమ్మెల్యే కోపంతో తన మేనల్లుడ్ని ప్రశ్నించిన కానిస్టేబుల్ చెంపల్ని వాయించేశారు. తమ వాళ్లను అడ్డుకున్నందుకు ప్రతిగా ఎమ్మెల్యే వ్యవహరించిన వైనం వీడియో క్లిప్పులు మీడియాలో ప్రముఖంగా ప్రసారమవుతోంది.
ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. అధికారపార్టీ ఎమ్మెల్యే తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. పోలీస్ స్టేషన్ కు వెళ్లి వీరంగం వేసిన ఎమ్మెల్యే తీరు ఒక ఎత్తు అయితే.. కానిస్టేబుల్ పై దాడి సందర్భంగా ఎమ్మెల్యే ప్రయోగించిన అసభ్య పదజాలం బీజేపీ నేతలకు ఇబ్బందికరంగా మారింది.