Begin typing your search above and press return to search.
కెమేరాకు చిక్కిన ఆ బీజేపీ నేతల బలుపు
By: Tupaki Desk | 30 Jun 2018 7:12 AM GMTదారుణ ఘటన చోటు చేసుకున్నప్పుడు.. ఆ ఘటనపై విచారం వ్యక్తం చేసేందుకు వచ్చే నేతలు ఎంత జాగ్రత్తగా ఉండాలి? కానీ.. అలాంటిదేమీ పట్టక చేతిలోని అధికారాన్ని బలుపుగా మార్చుకున్న వైనం ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తేలా చేస్తోంది. మధ్యప్రదేశ్ లో బీజేపీకి ఎంత బ్యాడ్ టైం నడవటం లేదని..కమలనాథులే తమ తీరుతో కొత్త కష్టాల్ని తెచ్చి పెట్టుకుంటున్నట్లుగా చెప్పక తప్పదు. తాజా ఉదంతాన్ని చూస్తే.. ఇదెంత నిజమన్నది ఇట్టే అర్థమవుతుంది.
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరానికి చెందిన ఎనిమిదో తరగతి చదివే చిన్నారిని అత్యంత పైశాచితంగా అత్యాచారం చేసిన ఉదంతం తెలిసిందే. ఈ షాకింగ్ దుర్మార్గం ఇప్పుడిప్పుడే అందరికి తెలుస్తోంది. చిన్నారి ప్రైవేట్ పార్ట్స్ ను కర్రతో.. రాడ్ తో పొడిచిన దుర్మార్గంతో ఇండోర్ నగరం చుట్టుపక్కల రగిలిపోతోంది.
విషమ పరిస్థితుల్లో ఉన్న బాలికను పరామర్శించేందుకు వచ్చిన తల్లిదండ్రులను ఉద్దేశించి ఎమ్మెల్యే సుదర్శన గుప్తా.. ఎంపీ చాలా దూరం నుంచి పరామర్శించేందుకే వచ్చారని.. ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలనటంతో రోదిస్తూ వారు.. చేతులు జోడించారు.
ఈ పరామర్శల పర్వం కెమేరా కంటికి చిక్కింది. ఓవైపు రేప్ బాధిత బాలిక చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతుంటే.. మరోవైపు బీజేపీ నేతలకు గౌరవం ఇవ్వాలన్న వైఖరిని పలువురు తప్పు పడుతున్నారు. బీజేపీ ఎంపీ.. ఎమ్మెల్యేల బలుపు చర్యను ఆ పార్టీ నేతలు సైతం తప్పుపడుతున్నారు. బాధిత కుటుంబ సభ్యుల్ని బీజేపీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు కోరటం సరికాదని చెబుతున్నారు. బీజేపీ ఎంపీ..ఎమ్మెల్యేల పరామర్శలపై తీవ్ర ఆగ్రహావేశాలు.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఉదంతానికి సంబంధించి అత్యాచార బాధిత బాలిక తల్లిదండ్రుల్ని పరామర్శించేందుకు బీజేపీ ఎంపీ సుధీర్ గుస్తా.. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ గుప్తాలు ఆసుపత్రికి వచ్చారు.