Begin typing your search above and press return to search.

ఆఫీస‌ర్ల కంటే వేశ్య‌లే బెట‌ర‌న్న బీజేపీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   6 Jun 2018 5:08 AM GMT
ఆఫీస‌ర్ల కంటే వేశ్య‌లే బెట‌ర‌న్న బీజేపీ ఎమ్మెల్యే
X
ఇటీవ‌ల కాలంలో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తున్న బీజేపీ నేత‌ల జాబితా అంత‌కంత‌కూ పెరుగుతోంది. తాజాగా దేశ వ్యాప్తంగా ఉండే ప్ర‌భుత్వ అధికారులకు ఒళ్లు మండే మాట‌ను అనేశారు. తాజాగా యూపీకి చెందిన బీజేపీ నేత సురేంద్ర సింగ్‌. వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌టం ఆయ‌న‌కు అల‌వాటే అయినా.. ఎప్పుడూ లేని రీతిలో ల‌క్ష‌లాది మంది ప్ర‌భుత్వ ఉద్యోగుల మ‌నోభావాలు దెబ్బ తినే వ్యాఖ్య‌ను చేవారు. ప్ర‌భుత్వ అధికారుల కంటే కూడా వేశ్య‌లే న‌య‌మ‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

ప్ర‌భుత్వ అధికారుల కంటే వేశ్య‌లేన‌య‌మ‌ని.. వారు డ‌బ్బులు తీసుకొని ప‌ని చేస్తార‌న్నారు. స్టేజీల‌పై డ్యాన్స్ లు చేస్తూ ప్ర‌జ‌ల్ని సంతోష‌ప‌రుస్తార‌ని.. కానీ ప్ర‌భుత్వ అధికారులు మాత్రం అలా చేయ‌ర‌న్నారు. లంచం అడిగిన అధికారుల్ని అక్క‌డే చెప్పుల‌తో కొట్టాల‌న్నారు.

బైరియా నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఆయ‌న గ‌తంలోనూ ప‌లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో అత్యాచార ఘ‌ట‌న‌లు పెర‌గ‌టానికి కార‌ణం త‌ల్లిదండ్రులేన‌ని.. వారు పిల్ల‌ల‌కు స్మార్ట్ ఫోన్లు ఇవ్వ‌టంతోనే ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్న‌ట్లుగా ఆయ‌న వ్యాఖ్యానించారు. ఆడ‌పిల్ల‌ల్ని స్వేచ్ఛ‌గా తిర‌గ‌కుండా క‌ట్ట‌డి చేయాలంటూ నోరు పారేసుకున్న ఆయ‌న‌.. ప‌దిహేనుళ్ల పిల్ల‌ల‌ను వారి త‌ల్లిదండ్రులు ఇళ్ల‌ల్లోనే ఉంచి కాప‌లా కాయాల‌న్నారు. అందుకు భిన్నంగా వారిని ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా గాలికి వ‌దిలేస్తున్నారంటూ నోరు పారేసుకున్నారు.

ఈ వ్యాఖ్య‌ల‌పై దేశ వ్యాప్తంగా నిర‌స‌న వ్య‌క్త‌మైంది. ఇలా ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సురేంద్ర‌సింగ్‌.. యోగి మంత్రివ‌ర్గంలోని కొంద‌రు మంత్రుల్ని తీసి వేయాల‌ని.. లేదంటే రాష్ట్రంలో పార్టీ ప‌త‌నం ఖాయ‌మ‌ని వార్నింగ్ ఇచ్చేశారు. అంతేకాదు. తాజాగా ఆయ‌న వార్నింగ్ డేను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా లంచాలు అడిగిన అధికారుల వాయిస్ ల‌ను రికార్డు చేయాల‌న్న‌ది ఆయ‌న ఆదేశం. ప్ర‌జ‌ల సంక్షేమం కోస‌మే తాను వ్యాఖ్య‌లు చేస్తానే త‌ప్పించి.. మ‌రో ఉద్దేశం త‌న‌కు లేద‌న్నారు. త‌ను చేసిన వ్యాఖ్య‌లు త‌ప్పంటే తాను జైలుకు వెళ్ల‌టానికైనా సిద్ధ‌మేన‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌పై ఇంత తీవ్ర‌స్థాయిలో నోరు పారేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్య‌లు ఇప్ప‌డు మంట పుట్టిస్తున్నాయి.