Begin typing your search above and press return to search.

ప్రియాంకా ఇల్లు కట్టే తీరు తప్పంట

By:  Tupaki Desk   |   18 Jun 2016 6:56 AM GMT
ప్రియాంకా ఇల్లు కట్టే తీరు తప్పంట
X
ఇప్పుడున్న తలనొప్పులు చాలవన్నట్లుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి మరో తలనొప్పు మొదలైంది. ఆమె కుమార్తె ప్రియాంకావాద్రా నిర్మిస్తున్న ఇంటి విషయంలో కొత్త రచ్చ షురూ అయ్యింది. ఏ ముహుర్తంలో స్టార్ట్ చేశారో కానీ.. సిమ్లాలో ఆమె నిర్మిస్తున్న ఇంటిపై ఇప్పటికే పలు విమర్శలు ఉన్నాయి. ఇవి చాలవన్నట్లుగా ఆమ నిర్మిస్తున్న ఇంటిపై అక్కడి స్థానిక బీజేపీ నేత ఒకరు ప్రధాని మోడీకి ఫిర్యాదు చేయటం ఆసక్తికరంగా మారింది.

ప్రియాంకాగాంధీ నిర్మిస్తున్న ఇంటికి దగ్గరగానే రాష్ట్ర్రపతి అతిధి గృహం ఉందని.. ఈ ఇంటి నిర్మాణం కారణంగా రాష్ట్రపతికి భద్రతాపరమైన తలనొప్పులు ఏర్పడే ప్రమాదం ఉందంటూ బీజేపీ నేత సురేష్ భరద్వాజ్ విమర్శిస్తున్నారు. ప్రియాంకా గాంధీ నిర్మిస్తున్న ఇంటికి సమీపంలోనే రాష్ట్రపతి వేసవి విడిది గృహం ఉందని.. ఇంటిని నిర్మిస్తే రాష్ట్రపతి భద్రతకు సంబంధించి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంకా ఇంటి నిర్మాణాన్ని నిలిపివేయాలన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది. మరి.. దీనిపై ప్రధాని మోడీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.