Begin typing your search above and press return to search.

గో మూత్రం తాగండి.. కరోనా ఇక పరారే.. వైరల్ గా మారిన బీజేపీ ఎమ్మెల్యే వీడియో..!

By:  Tupaki Desk   |   8 May 2021 6:14 AM GMT
గో మూత్రం తాగండి.. కరోనా ఇక పరారే.. వైరల్ గా మారిన బీజేపీ ఎమ్మెల్యే వీడియో..!
X
ప్రపంచవ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తోంది. దీంతో వైరస్ నియంత్రణ కోసం అన్ని దేశాలు వ్యాక్సినేషన్ ప్రారంభించాయి. శాస్త్రవేత్తలు మరి కొన్ని వ్యాక్సిన్ల తయారీలో అహోరాత్రులు శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే కరోనా సోకకుండా ఉండాలంటే రోజు గోమూత్రం తాగాలని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను రోజూ గోత్రం తాగుతుండటం వల్ల తనకు కరోనా సోకలేదని చెబుతూ ఒక వీడియో విడుదల చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

దేశంలో రోజూ అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ కూడా ముందంజలో ఉంది. అక్కడ రోజుకు 30 నుంచి 40 వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాతో ఆ రాష్ట్ర ప్రజలను ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని బల్లియా నియోజవర్గ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ కరోనాపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కరోనా గురించి ఆ ఎమ్మెల్యే ఓ వీడియో విడుదల చేసాడు అందులో ఏముందంటే..

'నా నియోజకవర్గ ప్రజలకు నేను ఒకటే చెబుతున్నా. ప్రజలందరూ కరోనా నియంత్రణకు రోజూ గోమూత్రం తాగండి. నేను పతంజలి కి చెందిన గోదాన్ సారం తీసుకుంటున్నా. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో చల్లటి నీటిలో 5 మూతలు గోమూత్రం కలుపుకొని తాగుతున్నాను. ఆ తర్వాత రోజంతా నేను 18 గంటల పాటు ప్రజల మధ్య తిరుగుతున్నప్పటికీ నాకు ఎటువంటి వైరస్ లేదు. కరోనా అంతానికి గోమూత్రం తీసుకోవడమే అసలైన పరిష్కారం అని నేను నమ్ముతున్నాను. ప్రజలు కూడా రోజు గోమూత్రం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను' అంటూ ఆ వీడియోలో ఎమ్మెల్యే పేర్కొన్నాడు. బీజేపీ ఎమ్మెల్యే విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.