Begin typing your search above and press return to search.
గవర్నర్ పై మోడీ శిష్యుడి తీవ్ర ఆగ్రహం!
By: Tupaki Desk | 10 Jan 2018 11:04 AM GMTకొన్ని విషయాలు గమ్మత్తుగా జరిగిపోతుంటాయి. సునిశితంగా పరిశీలిస్తే.. నిజమే కదా? అన్న భావన కలగటం ఖాయం. ప్రభుత్వం ఏది ఉన్నా.. తన కుర్చీని కాపాడుకోవటంలో రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తర్వాతే ఎవరైనా. గవర్నర్ సీట్లో కూర్చున్న వ్యక్తి ఎంతటి వివాదరహితుడైనా సరే.. ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియమించిన వారిని.. మరో పార్టీ అధికారంలోకి వచ్చాక కొనసాగించటం అరుదు. ఒకవేళ కొనసాగించినా.. రెండోసారి అవకాశం ఇవ్వటం ఉండదు.
అందుకు భిన్నంగా నరసింహన్ మాత్రం కొనసాగుతున్నారని చెప్పాలి. కేంద్రం ఆశీస్సులు పుష్కలంగా ఉన్న నరసింహన్ ను.. అదే పార్టీకి చెందిన ఏపీ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు మాత్రం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఓపక్క ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దొరకటం లేదు కానీ.. గవర్నర్ నరసింహన్ కు మాత్రం దొరుకుతోంది.
నిన్నటికి నిన్న ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీతో భేటీ అయి.. బయటకు వచ్చిన ఆయన.. తామేం మాట్లాడుకున్నామన్న విషయాల్ని ప్రెస్ నోట్ ద్వారా ప్రజలకు తెలిసేలా చేశారు. మరి.. అధినాయకత్వంతో అంత సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ.. ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గడిచిన కొద్దిరోజులుగా నరసింహన్ ను టార్గెట్ చేసుకున్నట్లుగా విమర్శలు చేసిన ఆయన.. తాజాగా మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గవర్నర్ ఏ రోజైనా కుటుంబ పెద్దలా వ్యవహరించారా? అని ప్రశ్నించటమే కాదు.. ఏపీలో కనీసం వారం రోజులైనా ఉన్నారా? అని నిలదీశారు. నాలా బిల్లును రాష్ట్ర సర్కారు పంపితే.. ఆర్నెల్లుగా పెండింగ్ లో పెట్టారంటూ మండిపడ్డారు.
వాస్తవానికి ఇలాంటి అంశాలు ఏపీ అధికారపక్షం తెలుగు తమ్ముళ్లు లేవనెత్తాల్సి ఉన్నా.. వారి నోటి నుంచి ఎలాంటి విమర్శ రావటం లేదు. అందుకు భిన్నంగా బీజేపీ నేత మాత్రం తీవ్రస్థాయిలో విమర్శిస్తున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. నరసింహన్ అంటే ఏ మాత్రం ఇష్టపడని విష్ణుకుమార్ రాజు.. ఏపీకి ప్రత్యేకంగా గవర్నర్ కావాలని.. పార్టీలకు అతీతంగా ఎంపీలంతా కేంద్రాన్ని కోరాలని డిమాండ్ చేశారు. తాము కూడా కేంద్రాన్ని.. బీజేపీ అధినాయకత్వం ముందు ఈ డిమాండ్‌ను పెడతామని చెబుతున్నారు. ఇంతకీ.. విష్ణుకుమార్ రాజుకు మోడీకి నరసింహన్‌కు ఉన్న అనుబంధం గురించి తెలిసే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? అంటూ కొందరు వ్యక్తం చేస్తున్న సందేహం పరిగణలోకి తీసుకోవాల్సిందే.