Begin typing your search above and press return to search.

క‌థువా ఎమ్మెల్యేను ఏకంగా మంత్రిని చేసేశారుగా?

By:  Tupaki Desk   |   1 May 2018 4:47 AM GMT
క‌థువా ఎమ్మెల్యేను ఏకంగా మంత్రిని చేసేశారుగా?
X
నిర్భ‌య ఉదంతం త‌ర్వాత దేశంలో అత్యాచారాలెన్నో జ‌రిగినా.. దేశ ప్ర‌జ‌ల్ని తీవ్రంగా ప్ర‌భావితం చేసింది మాత్రం క‌థువా ఆరాచ‌క ఘ‌ట‌న‌గా చెప్పాలి. ఎనిమిదేళ్ల బాలిక ప‌ట్ల దారుణ‌మైన లైంగిక వేధింపుల‌కు గురి చేసి.. అమానుషంగా హ‌త్య చేసిన వైనంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

ఇదిలా ఉంటే.. ఈ ఉదంతంలో నిజాలు వేర‌ని..అస‌త్యాల‌తో ప్ర‌చారం చేస్తున్నారంటూ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వారికి మ‌ద్ద‌తుగా ర్యాలీని నిర్వ‌హించ‌టం.. దీనికి బీజేపీ ఎమ్మెల్యే ఒక‌రు మ‌ద్ద‌తుగా ర్యాలీ చేయ‌టం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

దీనిపై పెద్ద‌ ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ వివాదం ఇంకా ఒక కొలిక్కి రాక‌ముందే పీడీపీ.. బీజేపీ ఉమ్మ‌డి స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మారింది. జ‌మ్ముక‌శ్మీర్ స‌ర్కారులో క‌థువా ఉదంతంలో నిందితుల‌కు అనుకూలంగా ర్యాలీ చేసిన క‌థువానియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే రాజీవ్ జ‌స్రోతియాకు మంత్రి ప‌ద‌విని ఇచ్చారు.

తాజాగా ముఫ్తీ త‌న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌ను చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆరోప‌ణ‌లు.. తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న క‌థువా ఎమ్మెల్యేకు మంత్రిగా బాధ్య‌త‌లు అప్ప‌గించ‌టం విశేషం.

మ‌రో ఆస‌క్తిక‌ర అంశం ఏమిటంటే.. ఇదే ర్యాలీలో పాల్గొన్న ఇద్ద‌రు మంత్రులు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా ఇవ్వ‌టం గ‌మ‌నార్హం. తాజాగా జ‌రిగిన విస్త‌ర‌ణ‌లో మొత్తం 8 మంది మంత్రులు ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌గా అందులో ఏడుగురు కొత్త‌వారు. ఇక‌.. ఈ ఎనిమిది మందిలో పీడీపీకి చెందిన నేత‌లు ఇద్ద‌రు న్నారు. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారి.. తీవ్ర ఆగ్ర‌హావేశాల‌కు గురి చేసిన క‌థువా ఉదంతం కేసులో బీజేపీ.. ముఫ్తీ స‌ర్కారు వైఖ‌రిని స్ప‌ష్టం చేయాలంటూ క‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ఒమ‌ర్ అబ్దుల్లా డిమాండ్ చేస్తున్నారు.

ముఫ్తీ మంత్రివ‌ర్గంలో క‌థువా ఎమ్మెల్యేను తీసుకోవ‌టంపై విస్మ‌యం వ్య‌క్తం కాగా.. ఉప‌ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన క‌వీంద‌ర్ గుప్తా చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత సంచ‌ల‌నానికి తెర తీసేలా ఉండ‌టం గ‌మనార్హం. క‌థువా గ్యాంగ్ రేప్ చిన్న ఉదంత‌మ‌ని.. దానికి అన‌వ‌స‌రంగా ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌టంతో ఎప్ప‌టి మాదిరి.. త‌న వ్యాఖ్య‌ల్ని ఆయ‌న కొట్టేస్తూ.. మీడియా త‌న వ్యాఖ్య‌ల్ని వ‌క్రీక‌రించిందన్నారు. అనాల్సిన‌వి అనేయ‌టం.. విమ‌ర్శ‌లు వెల్లువెత్తితే.. మీడియా మీద ప‌డిపోవ‌టం కామ‌నే క‌దా?