Begin typing your search above and press return to search.
తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేల అరెస్టు..రీజన్ ఇదే!
By: Tupaki Desk | 7 March 2022 10:30 AM GMTతెలంగాణ రాజకీయాలు జోరందుకున్నాయి. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునం దనరావులను పోలీసులు అరెస్టు చేశారు. సభలో సస్పెన్షన్‌కు నిరసనగా అసెంబ్లీ బయట ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పోలీసులు వ్యవహరించిన తీరుపై ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అయితే తమ ఎమ్మెల్యేల సస్పెన్షన్, అరెస్టును బీజేపీ నాయకత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది.
ప్రభుత్వం బీజేపీపై కక్ష గట్టినట్లుగా వ్యవహరిస్తోందని, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలను అరెస్టు చేశారని బీజేపీ భావిస్తోంది. గవర్నర్ ప్రసంగం లేకుండా సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి నిరసనగా బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం వారు అసెంబ్లీ బయట నల్ల కండువాలతో ఆందోళన చేస్తుండగా పోలీసులు అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమను అరెస్టు చేసే అధికారం పోలీసులకు లేదని, అసెంబ్లీ ప్రాంగణంలో మార్షల్స్ మాత్రమే తమను అరెస్టు చేయాలని బీజేపీ ఎమ్మెల్యేలు అన్నారు. ఆబిడ్స్ ఏసీపీ వెంకటరెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల హక్కులను హరించే అధికారం పోలీసులకు లేదని వారు అగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు.. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో నిబంధనలను పాటించకుండా.. ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించిందని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రభుత్వ తీరును తప్పబట్టింది. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడంపై కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది.
తన సభ్యులకు పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద మైక్ ఇవ్వకుండా నిబంధలను తుంగలో తొక్కారని విమర్శించింది. విపక్ష సభ్యులకు కనీస గౌరవం ఇవ్వకుండా సభను ఏకపక్షంగా నడుపుతున్నారంటూ నిరసన తెలిపిన కాంగ్రెస్ శాసనసభాపక్షం.. సభ నుంచి వాకౌట్ చేసింది.