Begin typing your search above and press return to search.
యడ్డీ రాజీనామా: బీజేపీ ఎమ్మెల్యేల సంబరాలు
By: Tupaki Desk | 28 July 2021 1:30 PM GMTపాపం.. యడ్యూరప్ప.. దిగిపోవడమే ఆలస్యం.. ఆయనపై రగిలిపోతున్న బీజేపీ ఎమ్మెల్యేలు పండుగ చేసుకుంటూ మీడియా ముందే హల్ చల్ చేస్తున్నారు. ఇన్నాళ్లు సీఎంగా ఉండగా యడ్డీని ఆడుకున్న సీనియర్ బీజేపీ ఎమ్మెల్యేలు.. ఇప్పుడు దిగిపోయినా కూడా ఆయనను వదలడం లేదు. చిత్రవిచిత్రమైన పనులతో యడ్డీని మరింత అవమానాల పాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. యడ్యూరప్పను వ్యతిరేకించిన బీజేపీ ఎమ్మెల్యేలంతా ఇప్పుడు ధావత్ లతో మునిగిపోయిన పరిస్థితి నెలకొంది.
నిన్నటిదాకా కర్ణాటకలో రాజ్యాధికారం ఏలిన బీఎస్ యడ్యూరప్ప ఇప్పుడు రాజీనామా చేసి మాజీ సీఎం అయిపోయారు. ఆయనను చూసి చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు సైతం జాలి చూపిస్తున్నారు. ఒక బీఎస్ యడ్యూరప్పను చూసి కర్ణాటకలోని బీజేపీ కార్యకర్తలు అయ్యోపాపం అంటున్నారు.
కర్ణాటకలోని బీజేపీ సీనియర్ ఎమ్మెల్యేల్లో విజయపుర నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే బసవన గౌడ పాటిల్ యత్నాల్ కూడా ఒకరు. 2019 జూలై 26వ తేదీన బీఎస్ యడ్యూరప్ప కర్ణాటక సీఎం అయిన తర్వాత సీఎంతో బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ బాగానే ఉన్నారు. తర్వాత సీన్ మారిపోయింది. యడ్డీ మీద ప్రతిపక్షాలు విమర్శలు పెరిగిపోయాయి. సొంత పార్టీకి చెందిన నాయకులు ఎవ్వరూ సీఎంను విమర్శించడానికి సాహసం చేయలేకపోయారు. అయితే అప్పటి కర్ణాటక సీఎం బీఎస్ యడ్యూరప్పను సొంత పార్టీ ఎమ్మెల్యే బసవన గౌడ విమర్శించడంతో బీజేపీ నేతలంతా అవాక్కయ్యారు.
బీఎస్ యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేయడంతో సొంత పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే సంబరాలు చేసుకుంటున్నారు. యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేసిన వెంటనే వెరైటీగా సంబరాలు చేసుకున్న ఆ పార్టీ బీజేపీ ఎమ్మెల్యే హమ్మయ్యా.. 'దేవుడిని కోరుకున్న వరం తీర్చేశాడు' అంటూ గంతులేశాడు. బీజేపీలో ఉన్నా కూడా ఈ సీనియర్ బీజేపీ ఎమ్మెల్యేకు ప్రతిరోజూ యడ్యూరప్పను ఆయన కొడుకును తిట్టకపోతే నిద్రపట్టదు.
ఇక మరో బీజేపీ ఎమ్మెల్యే యత్నాలు కూడా యడ్డీకి వ్యతిరేకంగా మారి విమర్శలు గుప్పించారు. మంత్రి పదవి రాకపోవడం.. ఆయన నియోజకవర్గానికి నిధులు తక్కువగా విడుదల కావడంతో యత్నాల్ రగిలిపోయాడు. అప్పటి కర్ణాటక సీఎం యడ్యూరప్పతోపాటు ఆయన కొడుకు బీవై విజయేంద్ర మీద ప్రతిరోజు బీజేపీ ఎమ్మెల్యే యత్నాల్ విమర్శలు గుప్పించేవాడు.
అప్పటి కర్ణాటక సీఎం బీఎస్ యడ్యూరప్పకి బహిరంగంగా చాలెంజ్ లు చేసిన యత్నాల్ కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారారు. రానురాను యడ్డీకి ఆయన కొడుకు విజయేంద్రను తిట్టడంతో పాపులర్ అయ్యాడు.కరోనా టైంలో.. ప్రభుత్వంతో తీరుతో ఇబ్బందులు పడుతున్నామని.. సీఎం పనితీరు బాగాలేదని విమర్శించి రచ్చరచ్చ చేశాడు.
ఇక యత్నాల్ విమర్శలు పీక్ స్టేజీకి చేరాయి. యడ్యూరప్ప సీఎంగా రాజీనామా చేసే వరకు తాను గడ్డం గీసుకోనని చాలెంజ్ చేశాడు. బాబాలాగా మారాడు. జూలై 26న యడ్యూరప్ప రాజీనామా చేయడంతో ఇప్పుడు యత్నాల్ తనకు భారీగా పెరిగిన గడ్డం తీసే పనిలో పడ్డాడు. కర్ణాటకకు కొత్త సీఎంగా బొమ్మై ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే యత్నాల్ గడ్డం గీసుకొని మీడియా ముందు హుషారుగా కనిపించడం విశేషం.
ఇలా కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలే సొంత పార్టీ సీఎంపై విమర్శలు.. దిగిపోవాలని ప్రతిజ్ఞలు, శపథాలు చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు యడ్యూరప్ప రాజీనామాతో వారంతా పండుగ చేసుకుంటున్నారు.