Begin typing your search above and press return to search.
బీజేపీ మంత్రికి షాకిచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు
By: Tupaki Desk | 22 Dec 2015 9:06 AM GMTశాసనసభలో అధికార పక్ష సభ్యులు ఏ విషయం మాట్లాడినా దానిని విపక్ష సభ్యులు అంగీకరించరు. లెక్కలతో సహా చెబుతున్నా అదంతా తప్పుడు సమాచారమని కొట్టిపారేస్తుంటారు. కానీ కొన్నిసార్లు మంత్రులు చెప్పిన విషయాలతో అధికార పార్టీ సభ్యలే అంగీకరించని పరిస్థితి కూడా వస్తుంది. అలాంటి పరిస్థితే మంత్రి కామినేని శ్రీనివాస్ కే వచ్చింది. బీజేపీ నుంచి చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్న ఆయనకు ఆ పార్టీ సభ్యులే షాక్ ఇచ్చారు.
చంద్రబాబుకు వీరవిధేయుడిగా కామినేని శ్రీనివాస్ కు పేరుంది. ఆయనతో ఎప్పటి నుంచో ఉన్న స్నేహం వల్లే ఆయనకు బాబు కేబినెట్ లో చోటు దక్కింది. తాజాగా అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో.. ప్రభుత్వ - ప్రైవేట్ వైద్య కళాశాలలు - బోధనాసుపత్రుల్లో సిబ్బంది గురించి సభ్యులు ప్రశ్నలు అడగగా... వైద్యకళాశాలలు - ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత లేదని, ఎటువంటి సమస్యలూ లేవని వైద్య - ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సమాధాన మిచ్చారు. అయితే ఈ సమాధానంతో సొంత పార్టీ సభ్యులు విష్ణుకుమార్ రాజు - ఆకుల సత్యనారాయణతో పాటు పలువురు టీడీపీ సభ్యులూ విభేదించారు. మంత్రి వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని, ప్రైవేట్ కళాశాలల్లో తనిఖీలప్పుడు అద్దె డాక్టర్లను తీసుకొస్తారని బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు అన్నారు.
డీమ్డ్ యూనివర్సిటీ పేరుతో ‘గీతమ్’లో ఒక్కో సీటు రూ. కోటికి అమ్ముతారని, ప్రభుత్వం నుంచి స్థలం, రాయితీలు పొంది వ్యాపారం చేసుకోవడం తప్పని గట్టిగా చెప్పారు. బీజేపీకి చెందిన మరో సభ్యుడు ఆకుల సత్యనారాయణ కూడా మంత్రి నిజాలు చెప్పాలనడంతో కామినేని కాస్త ఇబ్బందిగా ఫీలయ్యారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆయన మాటలతో విబేధించడంతో చేసేదేమీ లేక అన్ని ఆసుపత్రుల్లో చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.