Begin typing your search above and press return to search.
యోగితో యూపీలో చేతులు కాల్చుకున్న మోడీ
By: Tupaki Desk | 4 Jun 2018 4:39 AM GMTరాజకీయాల్లో ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవ్వడం అంటే ఇదేనేమో.. నిజానికి గడిచిన సమాజ్ వాదీ పాలన నచ్చకే యూపీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. బీజేపీకి దాదాపు 70కు పైగా సీట్లు అందించి కేంద్రంలో అధికారం కట్టబెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అఖిలేష్ యాదవ్ ను దించేసి యోగి ఆధిత్యనాత్ ను గద్దెనెక్కించారు. అయితే మోడీ ఎంతో నమ్మి అప్పగించిన పీఠాన్ని ఇప్పుడు యోగి తన చేష్టలతో భష్ట్రు పట్టిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వైఖరిపై తాజాగా మిత్రపక్షాలే కాదు.. సొంత పార్టీలోనూ అసంతృప్తి వెల్లువెత్తుతోంది.. ఇటీవల ముగ్గురు ఎంపీలు సర్కారు తీరుపై విమర్శలు గుప్పించారు. తాజాగా శని - ఆదివారాల్లో బీజేపీ మిత్రపక్షానికి చెందిన రాష్ట్ర మంత్రి - ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఘాటు విమర్శలు చేశారు. ఆందోళనలో పాల్గొనడంతో బీజేపీ ప్రభుత్వం ఇరకాటంలో పడింది.
యూపీ మంత్రి సుహేల్ దేవ్ - భారతీయ సమాజ్ పార్టీ (ఎస్ బీఎస్ పీ) అధినేత ఓ ప్రకాష్ రాజ్ భార్ .. యోగిని సీఎంగా నియమించిన విధానంపై మండిపడ్డారు. ‘యూపీ ప్రజలు బీజేపీకి అఖండ మెజార్టీని కట్టబెట్టారు. అందుకు కారణం ఎన్నికల వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య ముందుండి పార్టీని నడిపించడమే.. ఆయన సీఎం అవుతారని ప్రజలు భావించారు. కానీ ఫలితాల తర్వాత బీజేపీ అధిష్టానం అనూహ్యంగా యోగికి పట్టం కట్టింది. ప్రజలు ఆశించింది ఒకటైతే.. అధిష్టానం మరోటి చేసింది. అందుకే యోగీ నేతృత్వంలో ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతోంది.’ అని విమర్శించారు. అంతేకాదు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోతోందని ఆరోపించారు.
ప్రస్తుతం తమ సమస్యలు తీరడం లేదని బీజేపీ ఎమ్మెల్యేల ధర్నాలకు దిగడం యూపీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ప్రజా తీర్పును అవహేళన చేసి మోడీ యూపీ ప్రజలకు యోగిని సీఎం చేసి షాకిచ్చారు. అందుకే ఇప్పుడక్కడ నాయకుల్లో - ప్రజల్లో బీజేపీపై కోపం పెరిగిపోయింది. యోగిపై వ్యతిరేకత రోజురోజుకు ఎక్కువవుతోంది.