Begin typing your search above and press return to search.

నినాదాలు చేసిన బీజేపీ ఎమ్మెల్యేల‌పై వేటేశారు

By:  Tupaki Desk   |   24 March 2017 9:03 AM GMT
నినాదాలు చేసిన బీజేపీ ఎమ్మెల్యేల‌పై వేటేశారు
X
రూల్స్ ఎప్పుడూ ఉంటాయి. కానీ.. వాటిని వాడే వారికి త‌గ్గ‌ట్లే వాటి స్వ‌రూపం మారిపోతుంటాయి. తాజాగా తెలంగాణ అధికార‌ప‌క్షం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఉమ్మ‌డి రాష్ట్రంలో తాము విప‌క్షంలో ఉన్న‌ప్పుడు టీఆర్ ఎస్ నేత‌లు అసెంబ్లీ స‌మావేశాల స‌మ‌యంలో ఏ స్థాయిలో నిర‌స‌న చేసేవారో.. ఆందోళ‌న‌లు చేప‌ట్టేవారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌లో స‌క్సెస్ అయిన ఆ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అనుస‌రిస్తున్న విధానాలు చూసినో్ళ్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

తాజాగా జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల్లో బీజేపీ నేత‌ల‌పై వేసిన స‌స్పెన్ష‌న్ వేటు చూసినో్‌ళ్ల‌కు నోట మాట రాని ప‌రిస్థితి. ప్ర‌భుత్వం తెర‌పైకి తెచ్చిన మ‌త‌ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్ల‌కు వ్య‌తిరేకంగా బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆందోళ‌న‌కు దిగారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో బీజేపీ స‌భ్యుల నిర‌స‌న కేసీఆర్ స‌ర్కారుకు చిరాగ్గా అనిపించిన‌ట్లుంది.

అంతే.. తెలంగాణ రాష్ట్ర మంత్రి హ‌రీశ్ రావు లేచి.. మైకు అందుకొని.. బీజేపీ స‌భ్యుల తీరు చూస్తుంటే.. ఈ రోజు స‌భ‌లో స‌స్పెండ్ కావాల‌న్న‌ట్లుగా ఉన్న‌ట్లుందంటూ.. ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేల్ని ఈ వారం (రెండు రోజులు) పాటు స‌స్పెండ్ చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించ‌టంతో స‌భ‌లోని మిగిలిన ప‌క్షాలు అవాక్కు అయ్యే ప‌రిస్థితి.

ప్ర‌భుత్వం అనుస‌రించే విధానాల‌పై నిర‌స‌న తెలియ‌జేయ‌టం.. ఆందోళ‌న చేయ‌టం.. ప్ర‌శ్నోత్త‌రాల్ని అడ్డుకోవ‌టం ఇవాల్టి రాజ‌కీయ పార్టీల‌కు కామ‌న్‌. ఇలాంటి సంద‌ర్భంలో ప్ర‌తిప‌క్షాల‌ను బుజ్జ‌గించ‌ట‌మో.. లేదంటే.. స‌భ‌ను వాయిదా వేసి.. త‌ర్వాత కొన‌సాగించ‌ట‌మో చేస్తుంటారు. కానీ.. అందుకు భిన్నంగా ఎలాంటి మొహ‌మోటాల‌కు తావివ్వ‌ని రీతిలో క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకునేందుకు తాము సిద్ధ‌మ‌న్న‌ట్లుగా టీఆర్ ఎస్ స‌ర్కారు తీరు ఉండ‌టం గ‌మ‌నార్హం. ఎమ్మెల్యేల‌ను స‌స్పెండ్ చేయాల‌ని మంత్రి హ‌రీశ్ తీర్మానం పెట్ట‌టం.. అందుకు స్పీక‌ర్ ఓకే అనేయ‌టంతో ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు స‌భ‌ను నుంచి స‌స్పెండ్ అయిన ప‌రిస్థితి.

బీజేపీ స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేసిన తీరుపై కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్ష నేత జానారెడ్డి తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. స‌భ‌లో ప్ర‌భుత్వాన‌కి వ్య‌తిరేకంగా ఎవ‌రూ మాట్లాడినా స‌స్పెండ్ చేస్తున్న వైనం స‌రికాద‌న్నారు. నిరంకుశ ధోర‌ణితో ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న ఆయ‌న‌.. ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ఇలాంటి ధోర‌ణి ఏ మాత్రం మంచిది కాద‌న్నారు. ప్ర‌భుత్వ తీరును త‌ప్పు ప‌డుతూ జానారెడ్డి స‌భ నుంచి వాకౌట్ చేస్తూ త‌న నిర‌స‌న‌ను తెలియ‌జేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/