Begin typing your search above and press return to search.

లేఖ‌కు జవాబు ఇవ్వు వీడియోలు కాదు బాబు

By:  Tupaki Desk   |   29 March 2018 7:54 AM GMT
లేఖ‌కు జవాబు ఇవ్వు వీడియోలు కాదు బాబు
X
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై బీజేపీ నేత‌లు త‌మ ఘాటు ఎదురుదాడి కొన‌సాగిస్తున్నారు. కేంద్రాన్ని - ప్ర‌ధాని మోడీని టార్గెట్ చేస‌లా చంద్ర‌బాబు ప్ర‌సంగం ఉంటున్న నేప‌థ్యంలో బీజేపీ నేత‌లు సైతం విరుచుకుప‌డుతారు. తాజాగా ఎమ్మెల్సీ మాధవ్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎంతో సీనియ‌ర్ అని ప్ర‌చారం చేసుకుంటున్న‌ప్ప‌టికీ అందుకు త‌గిన రీతిలో వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని ఆక్షేపించారు. శాసనసభలో ప్రధానిమంత్రి ప్ర‌సంగించిన వీడియో క్లిప్పింగ్స్ చూపించడం ద్వారా ముఖ్య‌మంత్రి సభ మర్యాదలు ఉల్లగించారి అన్నారు. సభను టీడీపీ వారు స్వప్రయోజనాల కోసం - స్వార్ధ రాజకీయాలు కోసం వాడుకుంటున్నారని మండిప‌డ్డారు. `మీ ప్రధానమంత్రి అంటూ సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలను తీవ్రంగా పరిగణిస్తున్నాము. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. సభలో లేని ప్రధాన మంత్రి, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురించి ఎలా మాట్లాడుతారు?` అని నిల‌దీశారు. .

ప్రత్యేక హోదా అనేక సందర్భంల్లో మాట మార్చిన విధానాన్ని వీడియో క్లిప్పింగ్స్ రూపంలో ప్రదర్శించిన బీజేపీ ఎమ్మెల్సీ ఇదే సంద‌ర్భంగా బాబును ప్ర‌శ్నించారు. `చంద్రబాబు హోదాపై అనేక సార్లు మాట మార్చిన వీడియో క్లిప్పింగ్స్ అసెంబ్లీలో మేము వేయడానికి అనుమతి ఇస్తారా?

రుణమాఫీ - పిరాయిపులపై గతంలో ఇప్పుడు చంద్రబాబు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ చూపించేందుకు అనుమ‌తి ఇస్తారా?తన రాజకీయ అవసరాల కోసం పరిస్థితికి తగ్గట్లు సీఎం కామెంట్లు చేస్తున్నారు` అంటూ నిప్పులు చెరిగారు. పార్టీ ఫిరాయిపులపై గవర్నర్ కు పిర్యాదు చేస్తామని ప్ర‌క‌టించారు.

హోదా కన్నా ప్యాకేజీ బెటర్ అన్న చంద్ర‌బాబే ఇప్పడు బీజేపీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ మాధ‌వ్ మండిప‌డ్డారు. బీజేపీ వలన 15 సీట్లు కోల్పోయామంటున్న చంద్రబాబు గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన సంగతి మర్చిపోయారా అంటూ ప్ర‌శ్నించారు. `చంద్రబాబు పొత్తు లేకుండా ఒంటరిగా గెలిసిన చరిత్ర ఎన్నడూ లేదు. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. తనపై ఉన్న ప్రజా వ్యతిరేకత‌ను మళ్ళిచేందుకే బీజేపీపై టీడీపీ విమర్శలు చేస్తుంది.` అని ధ్వ‌జ‌మెత్తారు. `అమిత్ షా లేఖను ఎలా సభలో ప్రస్తావిస్తారు?
షా ప్రశ్నలకు సీఎం సమాధానం ఎందుకు ఇవ్వ‌లేదు? పైగా జ‌వాబు చెప్పకుండా ప్రజలపై దాడిగా అభివర్ణించడం సిగ్గు చేటు. బీజేపీకి ఇచ్చిన సీట్లలో రెబెల్స్ ను నిలబెట్టారు.. టీడీపీ మిత్ర ధర్మం కి వెన్నుపోటు పొడిచింది` అంటూ మండిప‌డ్డారు.

కాల్‌మనీ సెక్స్ రాకెట్లో ఎక్కువ డబ్బులు ఇస్తామని ప్రజల నుంచి డబ్బులు తీసుకొని టీడీపీ నాయకులు మోసం చేశారని టీడీపీ ఎమ్మెల్సీ ఆరోపించారు. `ప్రత్యక హోదా ముగిన అధ్యాయం. ఏ రాష్ట్రానికి కూడా హోదా ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కొన్ని పథకాలు ఆల‌స్యమయ్యాయి. తన తప్పులను కప్పి పుచ్చి కొనేందుకు బీజేపీపై టీడీపీ ఎదురు దాడి. అసెంబ్లీని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ గా ఉపయోగించు కుంటున్నారు` అంటూ విరుచుకుప‌డ్డారు.