Begin typing your search above and press return to search.
జగన్ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్సీ
By: Tupaki Desk | 26 Dec 2021 2:30 PM GMTతెలుగు సినిమా రంగానికి సంబంధించి జగన్ సర్కారు అనుసరిస్తున్న వైఖరిపై ఇప్పటికే పెద్ద చర్చ జరుగుతోంది. సినిమా థియేటర్లలో అమ్మే టికెట్ల మీద గడిచిన కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. అందుకు స్పందించిన థియేటర్ యజమానులు తమ సినిమా హాళ్లను పెద్ద ఎత్తున మూసి వేయటం తెలిసిందే. ఈ అంశంపై సినిమాకు సంబంధించిన ఒకరిద్దరు ప్రముఖులు మాత్రమే స్పందించారు. లోపల బాధ ఉన్నా.. ఏం మాట్లాడితే.. ఏం జరుగుతుందన్న ఆందోళన సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. సినిమా రంగంపై జగన్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై రాజకీయ నేతలు రియాక్టు అవుతున్నారు.
తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ స్పందించారు. సినిమా రంగంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారన్నారు. వ్యవస్థల్ని ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం చూస్తుందని.. సినిమా రంగంలో ప్రభుత్వం అనవసరంగా జోక్యం చేసుకుంటున్నాదన్నారు. కొన్ని థియేటర్లను మాత్రమే ప్రభుత్వం ఎందుకు టార్గెట్ చేసింది? అంటూ సూటిగా ప్రశ్నించారు.
ప్రభుత్వం పట్ల సానుకూల భావన లేదనే ఉద్దేశంతో సినిమా రంగాన్ని ప్రభుత్వం అనవసరంగా జోక్యం చేసుకుంటుందని.. ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో ఆ రంగంపై ఆధారపడిన వారు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. జగన్ సర్కారు వైఫల్యాలపై ఈ నెల 28న ప్రజాగ్రహ సభ నిర్వహిస్తున్నామని.. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ హాజరవుతారన్నారు. ఈ సభకు ప్రభుత్వ వైఖరి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆహ్వానించినట్లుగా చెప్పారు.
వ్యవస్థల్ని ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం చూస్తుందని.. ఇలాంటి తీరుతో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారన్నారు. విద్యార్థులు.. యువత.. పారిశ్రామికవేత్తలు తెలంగాణ.. కర్ణాటక రాష్ట్రాలకు వలస వెళుతున్నట్లు చెప్పారు. జగన్ ప్రభుత్వం వనరులు వినియోగించుకోకుండా అప్పులు చేస్తుందన్నారు. కాగ్ అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందని.. ఆదాయాన్ని సమకూర్చుకోకుండా సంక్షేమానికి ఖర్చు చేస్తున్నారన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని ప్రభుత్వం బెదిరిస్తుందన్న మాధవ్ మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏ విధంగా రియాక్టు అవుతారో చూడాలి.