Begin typing your search above and press return to search.
బోల్ట్ విషయంలో ఎంపీగారి లెక్క తప్పింది!
By: Tupaki Desk | 30 Aug 2016 1:00 PM ISTభాజపా నాయకులకు వేరే పనులు లేనట్టు ఎప్పుడూ బీఫ్ గురించే ఎక్కువగా మాట్లాడుతుంటారు! బీఫ్ తినొద్దని చెప్పొచ్చు.. దాన్లో తప్పులేదు. కానీ, ప్రతీ అంశాన్నీ దాంతో ముడిపెట్టి, అదే కోణంలో చూస్తూ మాట్లాడుతూ ఉంటే... వినేవారికి కాస్త విసుగు రాకమానదు. ‘రియో ఒలింపిక్స్ లో ఉసేన్ బోల్ట్ పతకాలు సాధించాడు. ఇంతకీ, బోల్ట్ అన్ని పతకాలు సాధించడం వెనక ఉన్న రహస్యం ఏంటో తెలుసా... ఆయన బీఫ్ తింటారు కాబట్టి’ అంటూ భాజపా పార్లమెంటు సభ్యుడు ఉదిత్ రాజ్ ఒక ట్వీట్ చేసేశారు. ఇంతకీ, బోల్ట్ ఫుడ్ మెనూ ఆయనకి ఎలా తెలిసింది అనేది వేరే విషయం. అయితే, ఇప్పుడు అందరి ఆసక్తీ బోల్ట్ భోజనంపైకి మళ్లింది. బోల్ట్ బీఫ్ తింటాడా... అతడు రోజూ ఎలాంటి ఆహారం తీసుకుంటాడు అనే విషయాలను తెలుసుకునేందుకు చాలామంది ఉత్సుకత చూపుతున్నారు.
జమైకా లాంటి ఒక చిన్న దేశంలో బోల్ట్ పుట్టాడు. 15 ఏళ్లకే ఆరు అడుగుల ఎత్తు పెరిగేశాడు. మొదట్లో క్రికెట్ ఆడేవాడు. ఆ తరువాత ట్రాక్ మార్చుకున్నాడు. బోల్ట్ ఫ్యామిలీ ఏమంత ఉన్నవారేం కాదు. కాబట్టి, మామూలు మధ్య తరగతి ప్రజలు తినే అన్నం - చేపలు వంటి ఆహారాన్నే తీసుకుంటాడు. ఇప్పటికీ బోల్ట్ అవే ఇష్టంగా తింటాడట. తన భోజనంలో కార్బో హైడ్రేడ్లు ఎక్కువగా ఉండేలా చూసుకుంటాని బోల్ట్ చెబుతున్నాడు. రైస్ - చికెన్ - కూరగాయలు బాగా ఎక్కువగా తింటా అని చెప్పాడు. విదేశాలకు వెళ్తే మాత్రం ఈ ఫుడ్ దొరక్కపోతే మెక్ డోనాల్డ్స్ - బర్గర్ కింగ్ లకు వెళతానన్నాడు. అప్పుడప్పుడూ జంక్ ఫుడ్ తింటాడట. తన భోజనంలో చికెన్ - ఫోర్క్ - చేప కూరలు కాస్త ఎక్కువగా ఉండేలా చూసుకుంటా అన్నాడు. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్లినా ఒక వంట మనిషి కూడా ఉంటాడనీ, తన మెనూని ఆయనే చూసుకుంటాడని బోల్ట్ చెప్పాడు.
ఇక, బోల్ట్ మెనూ ఏంటంటే... బ్రేక్ పాస్ట్ లో ఎగ్ శాండ్ విచ్ - చేపతో తయారు చేసే జమైకా స్థానిక వంటకం - కుకుడ్ బనానా - బంగాళ దుంపలు ఉంటాయి. మధ్యాహ్నం చికెన్ తోపాటు పాస్తా తింటాడు. రాత్రికి కొంచెం రోస్టెడ్ చికెన్ - రైస్ - పోర్క్... ఇవే తింటాడు. మధ్యలో ఒక మామిడి పండు - పైనాపిల్ - ఆపిల్ వంటి పళ్లు తింటాడు. ఇంతవరకూ బీఫ్ తినమని బోల్ట్ కి ఆయన కోచ్ కూడా చెప్పినట్టు లేదు! మరి, మనదేశంలో భాజపా ఎంపీకి ఎలా తెలిసిందే ఏంటో..?