Begin typing your search above and press return to search.
జగన్నే బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ?
By: Tupaki Desk | 25 Dec 2021 7:38 AM GMTబీజేపీ ఎంపీ సీఎం రమేష్ వ్యవహారం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డినే బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా ఉంది. మీడియాతో రమేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందట. అవసరమైతే కొందరు ఐపీఎస్ అధికారులను కేంద్రం రీకాల్ చేస్తుందన్నారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాష్ట్రంలో ఏమి జరుగుతోందో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు కేంద్రం హో సెక్రటరీకి కూడా వివరించారట. కాబట్టి ఇకమీదట ఐపీఎస్, ఐఏఎస్ ల ఆటలు సాగవట.
రమేష్ ఆరోపణలు, విమర్శలు చూస్తుంటే అచ్చంగా ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నట్లే ఉంది. రాష్ట్రంలో ఏమి జరుగుతోందో వీళ్ళు చెప్పేస్తే అదే వాస్తవమైపోతుందా ? రాష్ట్రానికి సంబంధించిన వివరాలు తెప్పించుకోవాలంటే పార్టీ నేతల మీద మాత్రమే ఆధారపడుతుందా ? సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంది, చీఫ్ సెక్రటరీతో మాట్లాడుతారు, డీజీపీని వివరాలు అడుగుతారు. అన్నింటికీ మించి గవర్నర్ తో కూడా మాట్లాడుతారు.
ఐఏఎస్, ఐపీఎస్ లను రీకాల్ చేయటానికి కేంద్రానికి అధికారం ఉందనటంలో సందేహం లేదు. అయితే ఆ పని అసాదారణ పరిస్థితుల్లో మాత్రమే జరుగుతుంది. అలాంటి పరిస్ధితులు ఇపుడు రాష్ట్రంలో ఉన్నాయా అన్నదే ప్రశ్న. ఐఏఎస్, ఐపీఎస్ లు ప్రభుత్వం చెప్పినట్లు వినకుండా ప్రతిపక్షాలు చెప్పినట్లు వింటారా ? అధికార యంత్రాంగం ప్రభుత్వం చెప్పినట్లు వింటుందా ? అన్నది మరో ప్రశ్న. అయితే... ఏ మాటకామాటే... గతంలో ఎన్నడూ లేనంతగా పోలీసు వ్యవస్థ లొంగిపోయిందన్నది నిజమే కానీ... అది బీజేపీ నేతలు చెబితే మార్చేంత ఉన్నదా అన్నది అనుమానం.
అయితే... రాష్ట్రంలోనే కాదు కేంద్రంలోని అధికార యంత్రాంగం మొత్తం బీజేపీ చెప్పినట్లే కదా వింటోంది. దర్యాప్తు సంస్దలైన సీబీఐ, ఐటీ, ఈడీ లాంటివన్నీ అధికార పార్టీ చెప్పినట్లే నడుచుకుంటున్న ఆరోపణలు వస్తున్న విషయం ఎంపీకి తెలీదా ? దర్యాప్తు సంస్ధలు అధికార పార్టీ చేతిలో పంజరంలోని చిలుకల్లాగ మారిపోయాయని స్వయంగా సుప్రింకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని రమేష్ మరచిపోయినట్లున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ ల రీకాల్ అని, టెలిస్కోపులో చూస్తోందని చెప్పి ప్రభుత్వాన్ని రమేష్ బెదిరిస్తున్నట్లే ఉన్నారు. మరి ఆ బెదిరింపుల వల్ల ఉపయోగం ఉంటుందా ?