Begin typing your search above and press return to search.

పాక్ ప్ర‌ధాని హిజాబ్ వేసుకోలేదు..ఇక్క‌డ ర‌చ్చ ఎందుకంటున్న అర్వింద్‌

By:  Tupaki Desk   |   20 Feb 2022 8:30 AM GMT
పాక్ ప్ర‌ధాని హిజాబ్ వేసుకోలేదు..ఇక్క‌డ ర‌చ్చ ఎందుకంటున్న అర్వింద్‌
X
క‌ర్ణాట‌క‌లో కొన‌సాగుతున్న హిజాబ్ రచ్చ‌పై ఊహించ‌ని వేగంతో దేశ‌మంతా వ్యాప్తి చెందిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో హైకోర్టు ఆదేశాలు వెలువ‌డిన‌ప్ప‌టికీ ఇప్ప‌టికీ ఇంకా వివాదం కొనసాగుతోంది. హిజాబ్ వివాదంపై నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

దేశంలో మోడీ వ్యతిరేక శక్తులు మైనార్టీ ముసుగులో ఏకమవుతున్నాయని బీజేపీ ఎంపీ అన్నారు. హిజాబ్ ఇస్లాంలో తప్పని.. సరేమీ కాదన్నారు. పాకిస్థాన్ ప్రధానిగా సేవ‌లు అందించిన బేన‌జీర్‌ భుట్టో హిజాబ్ వేసుకోలేదని అర్వింద్ తెలిపారు.

చ‌త్ర‌ప‌తి శివాజీ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ర్యాలీకి అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంపై బీజేపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ ఎస్ మైనార్టీ పార్టీల పక్షాన చేరి హిందూ వ్యతిరేకిగా మారందన్నారు. ముస్లింలు ర్యాలీ చేస్తే అనుమతి ఇస్తారని.. హిందువులు చేస్తామంటే వద్దంటారని చెప్పారు.

మక్కాకు వెళ్తే ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని.. కానీ హిందువులకు ఎందుకు ఇవ్వదని ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ను తరిమికొట్టి రామరాజ్యం వచ్చే వరకు పోరాటం ఆగదని తెలిపారు. సూడో(కపట)సెక్యులర్ పార్టీలు దేశానికి అత్యంత ప్రమాదకరమని అర్వింద్ హెచ్చరించారు.

సీఎం కేసీఆర్ కు దమ్ముంటే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి సవాల్ చేశారు. రెండు నెలల్లో టీఆర్ఎస్ లో కార్యకర్తలు ఎవరూ ఉండరని అన్నారు. పోటీ చేసే దిక్కు లేక.. నాయకత్వం పోయి టీఆర్ఎస్ అనాథగా మారుతుందని జోస్యం చెప్పారు.

`నిజామాబాద్ జిల్లాలో కమలం వికసించింది. ఆపడం ఎవరి తరమూ కాదు. హైదరాబాద్ లో రామరాజ్యం స్థాపన వరకూ ఆగదు` అని అర్వింద్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.