Begin typing your search above and press return to search.
ఐరాస జాబితాలో చంద్రబాబు పేరు లేదట!
By: Tupaki Desk | 25 Sep 2018 9:40 AM GMTఐక్యరాజ్యసమితిలో వ్యవసాయం, ప్రకృతి సేద్యంపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగించబోతున్నారంటూ ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే, చంద్రబాబు ప్రసంగం ....ఐరాస లో లిస్ట్ కాలేదని, చంద్రబాబు ఆహ్వానాన్ని మీడియా ముందు బయటపెట్టాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా జీవీఎల్ ...ఆ పర్యటన పై మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. న్యూయార్క్‌లో జరుగుతోన్న `వరల్డ్ ఎకనమిక్ ఫోరం` అనే స్వచ్ఛంద సంస్థ.. `బ్లూమ్ బర్గ్` అనే వాణిజ్య సంస్థతో కలిసి నిర్వహించే సమావేశానికి చంద్రబాబు వెళ్లారని, అంతేకానీ ఆయన ఐరాస సమావేశానికి వెళ్లలేదని ఆయన చెప్పారు. ఆ మాటకొస్తే ఆ సంస్థ.....ఐరాసతో ఏరకంగానూ భాగస్వామి సంస్థ కాదని, మరే ప్రభుత్వ సంస్థ కూడా కాదని స్పష్టం చేశారు. ఐరాస ఆధ్వర్యంలో కూడా ఆ సమావేశం నిర్వహించడం లేదని, కానీ, టీడీపీ నేతలు ఐరాస లో చంద్రబాబు ప్రసంగం అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.
ఐరాసలో సమావేశాలు జరుగుతున్న సమయంలో, దాని పక్కనే తమ ప్రచారం కోసం ఆ సంస్థలు ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నాయని...దానికి చంద్రబాబును ఆహ్వానించాయని చెప్పారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరంతో కలిసి ఏ పత్రిక అయినా అలాంటి సమావేశాలు నిర్వహించవచ్చని, తమ లాంటి నేతలను ఆహ్వానించ వచ్చని అన్నారు. ఐరాసలో 313 అంశాలపై సమావేశాలు జరుగుతున్నాయని, వాటిలో చంద్రబాబు ప్రసంగం లిస్ట్ కాలేదని జీవీఎల్ అన్నారు. తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు - ఎల్లో మీడియా...ఏపీ ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు. ఒకవేళ చంద్రబాబు స్పీచ్ ఉంటే...దాని తాలూకు ఆహ్వానం...ఆయన ప్రసంగించిన వీడియో బట్టబయలు చేయాలని అన్నారు. రాబోయే ఎన్నికల ముందు పబ్లిసిటీ కోసం చంద్రబాబు ఇదంతా చేస్తున్నారని అన్నారు. ఐరాస అనుబంధ బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు చంద్రబాబు ఆ బ్యాంకు ప్రతినిధులతో భేటీ కానున్నారని చెప్పారు.