Begin typing your search above and press return to search.

జీవీఎల్ మాట‌!... బాబుది దురుద్దేశ‌మే!

By:  Tupaki Desk   |   27 March 2018 11:23 AM GMT
జీవీఎల్ మాట‌!... బాబుది దురుద్దేశ‌మే!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదాకు సంబంధించి ఇప్పుడు ఏపీలోని దాదాపుగా అన్ని రాజ‌కీయ పార్టీలు ఉద్య‌మంలోకి దిగేశాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన ఏపీ నేత‌లు మిన‌హా.. దాదాపుగా అన్ని పార్టీల నేత‌లు ఇప్పుడు హోదా కోసం రోడ్డెక్కార‌నే చెప్పాలి. ఏపీలో అధికార పార్టీ టీడీపీ - విప‌క్ష వైసీపీ - జ‌న‌సేన‌ - కాంగ్రెస్‌ - వామ‌ప‌క్షాలు - ప్ర‌జా సంఘాలు ఇలా ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌త్యేక హోదా కోసం పోరు సాగిస్తున్నారు. ఈ క్ర‌మంలో వీరంద‌రినీ ఎదుర్కొనేందుకు కేంద్రంలో అధికారంలోని బీజేపీ... ఒక్కో అస్త్రాన్ని వ‌దులుతున్న‌ట్లుగా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే చెప్పాలి. నిన్న‌టిదాకా ఆ పార్టీ త‌ర‌ఫున ఏసీ శాస‌న‌మండిలో ఎమ్మెల్సీలుగా ఉన్న సోము వీర్రాజు - మాధ‌వ్‌ లు టీడీపీ తీరుపై త‌మ‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. ఇక ఏపీ అసెంబ్లీలో బీజేఎల్పీ నేత‌గా ఉన్న విష్ణుకుమార్ రాజు కూడా అవ‌కాశం చిక్కిన‌ప్పుడ‌ల్లా బాబు స‌ర్కారుపై త‌న‌దైన శైలిలో విసుర్లు సంధించారు.

తాజాగా బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న ఏపీ నేత జీవీఎల్ న‌ర‌సింహారావు కూడా రంగంలోకి దిగేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డానికి సాధ్యం కాకున్నా... హోదా కింద అందే నిధుల కంటే కూడా అధిక సాయ‌మే చేశామ‌ని, ఆ విష‌యాన్ని గ్ర‌హించినా కూడా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ను ఆశించే టీడీపీ ఎన్డీఏ కూట‌మి నుంచి బ‌య‌టకు వ‌చ్చేసింద‌ని, ఇదెక్క‌డి నీతి? అంటూ బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా... చంద్ర‌బాబుకు 9 పేజీల లేఖ రాసిన విష‌యం తెలిసిందే. ఈ లేఖ‌పై చంద్ర‌బాబు ఏకంగా అసెంబ్లీనే వేదిక‌గా చేసుకుని ఓ రేంజిలో ఫైరైపోయారు. ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని నిశితంగా ప‌రిశీలిస్తూ వ‌చ్చిన జీవీఎల్ నేటి మ‌ధ్యాహ్నం మీడియా ముందుకు వ‌చ్చేశారు. వ‌చ్చీరావ‌డంతోనే చంద్రబాబుది రాజ‌కీయ దురుద్దేశ‌మేన‌ని తేల్చేసిన జీవిఎల్‌... చంద్ర‌బాబు - టీడీపీ ప్ర‌భుత్వ వ్య‌వ‌హారంపై త‌న‌దైన శైలి విమ‌ర్శ‌లు చేశారు. అసలు అమిత్ షా రాసిన లేఖ‌కు ఏపీ ప్ర‌భుత్వం నుంచి ఇప్ప‌టిదాకా అస‌లు స‌రైన స‌మాధాన‌మే రాలేద‌ని చెప్పిన జీవీల్‌... అస‌లు విష‌యాలు బ‌య‌ట‌పెట్ట‌కుండా... త‌మ‌కు ప్ర‌యోజ‌నం క‌లిగించే విషయాల‌ను మాత్ర‌మే ప్ర‌స్తావిస్తూ టీడీపీ వింత వైఖ‌రితో ముందుకు సాగుతోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

అస‌లు విభ‌జ‌న చ‌ట్టంలో ఏముంద‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావించిన జీవీఎల్‌... ఏపీకి ఆర్థికంగా కేంద్రం చేయూత‌నందించాల‌ని ఉంద‌ని, ఈ క్ర‌మంలోనే ఏపీకి కేంద్ర ప్ర‌భుత్వం చాలానే సాయం చేసింద‌ని చెప్పారు. ప్ర‌త్యేక హోదా కంటే కూడా అధిక సాయ‌మే చేసింద‌న్నారు. ఇంత చేసిన కేంద్ర ప్ర‌భుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టే పార్టీల‌కు త‌మ రాజకీయాల ప‌ట్ల విశ్వాసం లేద‌ని భావించాల్సి వ‌స్తుంద‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు. ఏపీకి జరిగిన మేళ్ల‌ను మ‌రిచిపోయి... సినిమా స్క్రిప్టుల‌ను చ‌దువుతున్నార‌ని కూడా జీవీఎల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు. మొన్న‌టిదాకా ప్ర‌త్యేక ప్యాకేజీకి స‌రేన‌న్న చంద్ర‌బాబు... ఇప్పుడు ప్ర‌త్యేక హోదా నినాదాన్ని ఎత్తుకోవ‌డం ఆయ‌న రాజ‌కీయ దురుద్దేశానికి నిద‌ర్శ‌న‌మ‌ని కూడా జీవీఎల్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మొత్తంగా ప్ర‌త్యేక హోదా కోసం సాగుతున్న ఉద్య‌మాన్ని నీరుగార్చే క్ర‌మంలో భాగంగా బీజేపీ త‌న తురుపు ముక్క‌ల‌ను ఒక్క‌టొక్క‌టిగా వ‌దులుతోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.