Begin typing your search above and press return to search.
మీరు చేసేది పిడకల వేటలా ఉంది జీవీఎల్ సార్!
By: Tupaki Desk | 11 April 2022 2:35 PM GMTఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పంటించుకునేందుకు ఎదురు చూస్తున్నాడంట మరొకడు! బీజేపీ సీనియర్ నేత, ఎంపీ.. జీవీఎల్ నరసింహారావు పరిస్థితి ఇలానే ఉందని అంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం వైసీపీలో మంత్రి పదవులు రాని వారు అంతో ఇంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది సహజం.. మానవ శరీర లక్షణం కూడా! ఎంత మానసికంగా.. సిద్ధమైనా.. పదవులు పోయిన వారిలో ఆ మాత్రం బాధ ఉంటుంది. అందుకే.. ఒకరిద్దరు.. నొచ్చుకుంటున్నారు. దీనిని పెద్దగా చేసి చూడాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే.. ఎంత బాధ ఉన్నా.. వీరంతా.. జగన్‌ను వదిలి పెట్టే కాండిట్లు కానేకాదు... ఇక,జగన్ కూడా వారిని వదిలి పెట్టే పరిస్థితి లేదు. ఒకటిర రెండు రోజులుఇలాంటి సెంటిమెంట్లు.. ఉద్వేగాలు సహజం. అయితే.. ఇప్పుడు వీటిని చూసిన బిజిపి రాజ్యసభ సభ్యులు జీవీ ఎల్ నరసింహారావు తమకు ఈ పరిణా మం లబ్ధి చేకూరుతుందని.. వైసీపీ ఇక.. పటాపంచలు అయిపోతుందని.. వ్యాఖ్యానించడం.. గమనార్హం. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అధికార పార్టీలో కలకలం రేపుతున్నాయని.. అసమ్మతి సెగలు కమ్ముకుంటున్నాయని.. ఎవరైనా.. వస్తే.. మేం వారిని ఆదరిస్తామని.. అంటున్నారు.
నిన్నటి వరకు మాకు ఒక్కడే నాయకుడు అని డప్పులు కొట్టుకున్న పాలకపక్షం నేతలు ఇప్పుడు పదవుల కోసం కొట్లాడుకుంటున్నారని జీవీఎల్ వ్యాఖ్యానించారు. ఒకే మాట ఒకే బాట అన్న నాయకులు నేడు పదవులకు ఏడుపులు, పెడబెబ్బులు చూస్తుంటే వైసిపి పతనం మొదలైందని.. ఇది బీజేపీకి లాభిస్తుందని.. చెబుతున్నారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి వైసీపీ నేతలు పలువురు గైర్హాజరయ్యా రని తెలిపారు. రోడ్లపై ఆందోళనలు.. జరుగుతున్నాయని.. మాజీ హోమ్ మంత్రి సుచరిత రాజీనామా.. చేశారని అన్నారు.
ఇక, వైసీపీ పతనం అంచులకు చేరుకుందని.. జీవీఎల్ అత్యుత్సాహం వ్యక్తం చేశారు. మంత్రి వర్గ ఏర్పా టులో జగన్ మోహన్ రెడ్డి పాటించిన విధానమేమిటని ప్రశ్నించారు. మంత్రులను తొగించడంలో సలహా దారుడికి అధికారమెక్కడుందన్నారు. ప్రధాన సలహా దారు రాజ్యాంగ బద్ధమైన పదవి కాదని చెప్పిన ఆయన సజ్జల వ్యవహారంపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతి నిధులు గా ఉన్న వారిని మంత్రి పదవుల నుండి తొలగిస్తే వారు ప్రజల్లోకి ఎలా వెళ్లగలుగుతారని పప్రశ్నించారు.
కమ్మ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ కులాలకు చెందిన వారిని అణగదొక్కారని జీవీఎల్ వ్యాఖ్యానించారు. నిజ మైన సాధికారత అంటే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేయడమేనని.. సీఎంకు ఆ దమ్ము ఉందా అని జీవీఎల్ ప్రశ్నించారు. ఈ వ్యవహారం చూస్తే.. రామాయణంలో పిడకల వేట మాదిరిగా ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.