Begin typing your search above and press return to search.
ఎంపీకి కరోనా పాజిటివ్ ..ఆందోళనలో ఆ ఆర్మీ కుటుంబం !
By: Tupaki Desk | 4 July 2020 10:45 AM ISTభారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు శర వేగంగా పెరుగుతోంది.. లాక్ డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో తక్కువగా నమోదైన కేసులు.. అన్ లాక్ దశలో విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే దేశంలో వైరస్ కేసుల సంఖ్య ఆరు లక్షలు దాటిపోయింది. ఇక దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు కూడా వైరస్ బారినపడుతున్నారు.
ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న రాష్ట్రాల జాబితాలో పశ్చిమ బెంగాల్ కూడా ఉంది. బెంగాల్ రాష్ట్రానికి బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీకి వైరస్ పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఇప్పటికే వైద్యులు కూడా దృవీకరించారు. గత వారం రోజులుగా ఛటర్జీ స్వల్ప జ్వరంతో బాధపడుతుండటంతో సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు ఆమె తెలిపింది.
అయితే, జూన్ 19 వతేదీన ఆర్మీ జవాన్ రాజేష్ ఓరంగ్ అంత్యక్రియల్లో ఈ ఎంపీ లాకెట్ ఛటర్జీ పాల్గొన్నారు. అంతకుముందు ఎంపీ ఆర్మీ జవాన్ కుటుంబాన్ని పరామర్శించారు. దీనితో ఇప్పుడు ఆ ఆర్మీ జవాన్ కుటుంబంలో భయాందోళనలు మొదలయ్యాయి. ఇకపోతే, జవాన్ ఓరంగ్ అంత్యక్రియల్లో వందలాది మంది పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత అధీర్ రంజన్ చౌధరి సైతం పాల్గొన్నారు. లాకెట్ ఛటర్జీకి కరోనా సోకిందని తేలడంతో ఆమెతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలు, సన్నిహితుల్లో ఆందోళన వ్యక్తమౌతోంది. దీనితో అక్కడి అధికారులు ఏంచేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. కాగా , రాష్ట్రంలో కరోనా కేసులు 19,819 కి చేరుకొన్నాయి.13,037 మంది కరోనా నుండి కోలుకొన్నారు...