Begin typing your search above and press return to search.
మోడీమాటలతో.. తెరపైకి ఎంపీ వింతకోరిక
By: Tupaki Desk | 17 Aug 2016 5:44 PM GMTబీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే తాజాగా మీడియా ముందుకు వచ్చి తనకు కావాల్సిన కొత్త ఎంపీ స్థానం గురించి వింతైన కోరికను బయటపెట్టారు. సాదారణంగా నాయకులు.. తమ స్థానిక నియోజకవర్గాలను, సులువుగా గెలిచే ప్రాంతాలను, వారి పార్టీలకు పెట్టనికోటలుగా ఉన్న స్థానాలను కోరుకుంటారు. కానీ.. ఈయన మాత్రం ఈ సారి తనకు ఎంపీ సీటు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) నుంచి కావాలని కోరుతున్నారు. కోరుతున్నారంటే ఆ మాట చాలా చిన్నదైపోతుందేమో.. పోరాడుతున్నారు అనే అనాలి. ఎందుకంటే.. ఈ కోరిక ఈయన మొదటిసారి చెప్పింది కాదు. ఇప్పటికే ఈ ఎంపీ సీటు కోసం చిన్నసైజు పోరాటాలు కూడా చేశారు.. చేస్తున్నారు.
ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్ కోసం జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. స్థానాలు అయితే కేటాయింపబడ్డాయి కానీ... వాటికి ప్రాతినిథ్యం లేకపోవడంతో దశాబ్దాల నుంచి ఆ సీట్లన్నీ ఖాళీగానే ఉంటున్నాయి. ఉన్న 24 అసెంబ్లీ స్థానాలకే ప్రాతినిథ్యంలేక ఖాళీగా ఉంటే ఈయనికి కొత్తగా ఎంపీ సీటుకావాలంట అని సెటైర్లు పడుతున్నా... అన్ని అసెంబ్లీ స్థానాలున్న ఆ ప్రాంతానికి ఒక్క ఎంపీ సీటుకూడా లేదనే లాజిక్కుతో పోరాడుతున్నారు దుబే. ఈ మేరకు చట్టం రూపొందించాలనే డిమాండ్ లోక్ సభలో 2014, 2015 సంవత్సరాల్లో ప్రైవేట్ మెంబర్ బిల్లును కూడా పెట్టారు. అయితే ప్రస్తుతం బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండటంతో.. ఈ చట్టాన్ని పార్లమెంట్ లో ఆమోదించాలని మోడీ సర్కారును డిమాండ్ చేస్తున్నారు ఈ బీజేపీ ఎంపీ. ప్రస్తుతం జార్ఖాండ్ రాష్ట్రంలోని గొడ్డా స్థానం నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తోన్న నిశికాంత్ దుబే పీఓకేలో పోటీ మాటెత్తడం ఇది మొదటిసారి కాకపొవడం గమనార్హం.
ఎంతోకాలం నుంచి ఈ ఎంపీ స్థానం కోసం వేయికళ్లతో ఎదురుచుస్తున్న ఈ ఎంపీ గారికి.. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ.. పీఓకే భారత్ లో అంతర్భాగమంటూ చేసిన ప్రకటనతో కొత్త ఉత్సాహం వచ్చింది! దాంతో మరోసారి తన పాతకోరికపై కొత్త ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... నిశికాంత్ దుబే, ఆయన భార్య అనామికా గౌతం లు 2014 ఎన్నికల్లో ప్రచారం కోసమని ఒక వ్యాపారిని రూ.2 కోట్లు లంచం అడిగినట్లు ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదయింది.