Begin typing your search above and press return to search.

రీల్ ద్రౌపతి కొడుకు తాగి ఎంత రచ్చ చేశాడంటే?

By:  Tupaki Desk   |   16 Aug 2019 7:12 AM GMT
రీల్ ద్రౌపతి కొడుకు తాగి ఎంత రచ్చ చేశాడంటే?
X
బుల్లితెర మీద ద్రౌపతిగా సుపరిచితురాలు నటి కమ్ బీజేపీ ఎంపీ రూప గంగూలీ వార్తల్లోకి వచ్చారు. ఏ రకమైన వార్తల్లో ఆమె పేరు వినిపించకుడదో అందులోనే ఆమె పేరు ఇప్పుడు బయటకు రావటం గమనార్హం. ఇటీవల కాలంలో బీజేపీ నేతలు.. వారి సంతానం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని.. తరచూ వివాదాల్లోకి కూరుకుపోతున్న వైనం తెలిసిందే. అందుకు కొనసాగింపుగా తాజా ఉదంతాన్ని చెప్పక తప్పదు.

బీజేపీ రాజ్యసభ సభ్యురాలు రూప గంగూలీ కుమారుడు ఫుల్ గా తాగేసి.. విలాసవంతమైన కారును అమితమైన వేగంతో రోడ్డు మీద పోనిచ్చి బీభత్సాన్ని సృష్టించాడు. రాష్ డ్రైవింగ్ తో అతగాడి దెబ్బకు అక్కడి స్థానికులు భయంతో పరుగులు తీయాల్సిన పరిస్థితి. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతాలో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే..

ఎంపీ రూప గంగూలీ కుమారుడు 20 ఏళ్ల ఆకాష్ ముఖోపాధ్యాయ్ ఫుల్ గా తాగేశాడు. అతని విలాసవంతమైన సెడాన్ కారును మితిమీరిన వేగంతో రోడ్లపై దూసుకెళ్లాడు. నియంత్రణ తప్పి విలాసవంతమైన గోల్ఫ్ గార్డెన్ ఏరియాలోని కోల్ కతా క్లబ్ గోడను ఢీ కొట్టాడు. వేగంగా దూసుకెళ్లిన కారు.. గోడలో ఇరుక్కుపోయి ఆగింది. ఈ ఉదంతంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కొడుకు నిర్వాకం గురించి తెలుసుకున్నంతనే అతడి తండ్రి ఘటనాస్థలానికి చేరుకొని కారులో నుంచి బయటకు తీశారు. మద్యం సేవించి ఉన్నారన్న ఆరోపణపై అతడ్నిపోలీస్ స్టేషన్ కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ ఉదంతం మీద ఎంపీ రూప రియాక్ట్ అయ్యారు. ఒక ట్వీట్ చేశారు. తన ఇంటికి సమీపంలో తన కుమారుడు ఒక యాక్సిడెంట్ కు గురయ్యారని పేర్కొన్నారు. చట్టప్రకారం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటారని.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్న ఆమె.. తాను తన కొడుకును ప్రేమిస్తానని.. తానే పోలీసులకు సమాచారం అందించి.. అప్పగించినట్లుగా పేర్కొన్నారు. ఈ ఉదంతంలో ఎలాంటి రాజకీయాలకు తావు లేదని.. చట్టపరంగా తీసుకోవాలని తాను పోలీసులను కోరినట్లు చెప్పారు. కొసమెరుపు ఏమంటే.. ఈ ట్వీట్ ను ప్రధాని మోడీకి ట్యాగ్ చేయటం ద్వారా..ఎవరో ఆ విషయాన్ని ఆయనకు తెలియజేసే కన్నా.. తానే నేరుగా చెప్పేసినట్లుగా వ్యవహరించటం గమనార్హం.