Begin typing your search above and press return to search.
ఆయన్ను నమ్మినోళ్లు అడ్డంగా మునిగారు!
By: Tupaki Desk | 18 Dec 2017 3:30 PM GMTగుజరాత్ ఎన్నికల ఫలితాలు పూర్తయిపోయాయి. అయితే.. కొన్ని టీవీ ఛానెళ్లకు మీడియా సంస్థలకు మాత్రం.. ఈ ఫలితాలు నోట మాటరాకుండా చేశాయి. ప్రధానంగా ఒక నాయకుడి మాటలను నమ్మి.. మోడీ వ్యతిరేక ప్రచారాన్ని ప్రధానంగా సాగించిన.. దేశంలోని మీడియా సంస్థలు, టీవీ ఛానెళ్లు అన్నీ.. ఇప్పుడు ఒక్కసారిగా.. ఖంగుతిన్నాయి. సోమవారం ఉదయం నుంచి వారికి నోటమాట రాలేదంటే.. వింత కాదు. ఇంతకూ ఆ మీడియా సంస్థలన్నీ.. అంత గుడ్డిగా నమ్మేసి.. వారి క్రెడిబిలిటీ బజారు పాలు కావడానికి కారకుడు అయిన వ్యక్తి.. భాజపా ఎంపీ సంజయ్ కాకడే!
సంజయ్ కాకడే మహారాష్ట్ర నుంచి భాజపా ఎంపీగా ఉన్నారు. రెండో విడత పోలింగ్ కూడా ముగిసిన తర్వాత.. నిజానికి ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన దాదాపు అన్ని సర్వే సంస్థలు కూడా అంతో ఇంతో తేడాలతో భాజపాకు అనుకూల ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్నే వెల్లడించాయి. ఎన్నికలకు ముందు బయటకువచ్చిన సర్వే ఫలితాలలో కొంత వ్యత్యాసాలు పరస్పర విరుద్ధంగా కొందరు కాంగ్రెస్ కు, కొందరు భాజపాకు విజయాన్ని కట్టబెట్టడం జరిగింది గానీ.. రెండు విడతల పోలింగ్ ముగిసిన తర్వాత వచ్చిన అన్ని ఎగ్జిట్ పోల్స్ ఏకపక్షంగా రెండు రాష్ట్రాల్లోనూ భాజపాకే విజయావకాశాలను సూచించాయి. అయితే.. స్వయంగా భారతీయ జనతా పార్టీ ఎంపీ అయిన సంజయ్ కాకడే ఒక్కరే కాస్త తేడాగా స్పందించారు. తాను తన సొంతంగా ఒక సర్వే చేయించానని.. గుజరాత్ లో తమ పార్టీకి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం ఉన్నదని, 75 శాతం ఓట్లు కాంగ్రెస్ కే పడ్డాయని తన సర్వేలో తేలిందని.. అయిదుసార్లు అప్రతిహత విజయం తర్వాత తాము ప్రతిపక్షంలో కూర్చోబోతున్నాం అని ఆయన రకరకాలుగా తన జోస్యం చెప్పారు.
మోడీ వ్యతిరేకత తో ఉండే మీడియా సంస్థలు అందరికీ ... సంజయ్ కాకడే వ్యాఖ్యలు లడ్డూలాగా కనిపించాయి. ఎడాపెడా కథనాల్ని వండి వార్చడం ప్రారంభించారు. అసలు గుజరాత్ లో విజయావకాశాల గురించి.. భాజపా సొంత పార్టీ నాయకులకే ఎలాంటి నమ్మకం లేదని.. చాలా మంది గుంభనంగా మాట్లాడకుండా మౌనం పాటిస్తుండగా.. సంజయ్ కాకడే మాత్రం ధైర్యంగా తన స్పందన చెప్పారని ఆయనను కీర్తించేశారు. తీరా ఫలితాలు వచ్చేసరికి మొత్తం తిరగబడింది. సంజయ్ కాకడే మాటల్ని నమ్ముకుని విపరీతమైన మోడీ వ్యతిరేక ప్రచారానికి, భాజపా ఓటమికి బీభత్సంగా పాల్పడిన వారంతా.. కిక్కురు మనకుండా ఉండిపోయారు. కాకడే ను నమ్మినందుకు నట్టేట మునిగాం అంటూ విచారించారు.