Begin typing your search above and press return to search.
హనుమంతుడు ఎస్సీయే....అందుకే తొక్కేశారు
By: Tupaki Desk | 5 Dec 2018 4:34 AM GMT`హనుమంతుడు దళితుడు` అనే వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. హనుమంతుడు దళిత గిరిజనుడు అని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించి కొత్త చర్చకు తెరలేపి సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ సీఎం సృష్టించిన ఈ కలకలంలో తాజాగా అదే రాష్ర్టానికి చెందిన బీజేపీ ఎంపీ సావిత్రీ బాయిఫూలే ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ హనుమంతుడు కూడా మనిషి అని, ఆయన కోతి కాదని తెలిపారు. దళితుడైనందుకు హనుమంతుడు కూడా అవమానాన్ని ఎదుర్కొన్నారని చెప్పారు.
అసలు దళితులను ఎందుకు మనుషులుగా గుర్తించరని సావిత్రీబాయి ఫూలే ప్రశ్నించారు. `హనుమంతుడు దళితుడే. ఆయనను మనువాదులకు బానిసగా మార్చారు. రాముడి కోసం ఆయన ఎంతో చేశారు. కానీ, చివరికి హనుమంతుడికి ఓ తోకను తగిలించి, ఆయన ముఖానికి మసిపూసి కోతిగా ఎందుకు చిత్రీకరించారు` అని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా అయోధ్య విషయాన్ని బీజేపీ తెరమీదకు తెస్తుందని, అసలు అయోధ్యలో రామ మందిరం నిర్మించాల్సిన అవసరం లేదని సావిత్రీ బాయిఫూలే తెలిపారు. నిరుద్యోగాన్ని, దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను రామ మందిరం పరిష్కరించగలదా? అని నిలదీశారు.