Begin typing your search above and press return to search.

పోలవరం పేరు మార్చాలని జీవీఎల్ డిమాండ్ !

By:  Tupaki Desk   |   11 Dec 2019 6:38 AM GMT
పోలవరం పేరు మార్చాలని జీవీఎల్ డిమాండ్ !
X
పోలవరం ..ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకం గా తీసుకోని నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్. దేశంలో నీటి సంక్షోభం నివారణకు జాతీయ ప్రాజెక్టుల సత్వర పూర్తి.. నీటి అంశాన్ని కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితా లో చేర్పు అంశంపై ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఇచ్చిన సావధాన తీర్మానంపై మంగళవారం రాజ్యసభలో గంటపాటు చర్చ జరిగింది. ఈ చర్చలో కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ, టీడీపీ, బీజేపీ సహా ఇతర పార్టీల సభ్యులు పాల్గొని పోలవరం ప్రాజెక్టు పై పలు ప్రశ్నలు లేవనెత్తారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం క్రియాశీలకంగా పనిచేస్తే కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అన్నారు. ‘2014 లెక్కల ప్రకారం ప్రాజెక్టు ఖర్చు ను కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. కానీ, 2013 భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చాక ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగి పోయింది. అనంతరం.. రాష్ట్ర ప్రభుత్వం రూ.55,548 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయ ప్రతిపాదనలు పంపింది.

బీజేపీ ఎంపీ జీవీఎల్‌ మాట్లాడుతూ .. 2014కు ముందు ఖర్చుచేసిన నిధులకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమర్పించడం లేదని ప్రశ్నించారు. అలాగే ఇప్పటివరకు ఈ పోలవరం నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 6,764 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ పోలవరం కోసం మరో 1850 కోట్ల రూపాయలను విడుదల చేసింది అని తెలిపారు. ఇక ఈ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం రూ.2,377 కోట్లు అదనంగా ఖర్చుచేసినట్టు నిపుణుల కమిటీ నిర్ధారించిన దాని పై స్పష్టత ఇవ్వాలన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తున్నందున దీనిని ప్రధానమంత్రి పోలవరం ప్రాజెక్టు గా గుర్తించాలని జీవీఎల్‌ కోరారు. కానీ , బీజేపీ నేతలు మాత్రం పోలవరం పేరు మార్పు లో కామెంట్స్ చేయలేదు.