Begin typing your search above and press return to search.
సొంత పార్టీపై మరోసారి శత్రుఘ్నసిన్హా
By: Tupaki Desk | 22 May 2017 10:50 AM GMT పార్టీలోనే ఉంటూ తరచూ అధినాయకత్వంపై విమర్శలు చేసే బీజేపీ ఎంపీ, బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్నసిన్హా మరోసారి సొంత పార్టీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. వ్యతిరేక రాజకీయాలు చేయొద్దని, ప్రత్యర్థులపై బురద చల్లడం మానుకోవాలని బీజేపీకి సూచించారు. అరవింద్ కేజ్రీవాల్, లాలూ ప్రసాద్ యాదవ్‌లకు మద్దతుగా ఆయన మాట్లాడారు. బీజేపీ విధానాలను విమర్శిస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు.
నెగెటివ్ రాజకీయాలు ఇక చాలించండి. కేజ్రీవాల్, లాలూ యాదవ్ వంటి ప్రత్యర్థులను అపఖ్యాతిపాల్జేసేందుకు ప్రయత్నించడం మానుకోవాలి. నిజాయితీ, పారదర్శకత పట్ల మన పార్టీకి నమ్మకముంది. మనమంతా కలిసికట్టుగా ఉండాలి. ప్రత్యర్థులపై నిరాధార ఆరోపణలు చేయడం మంచిది కాదు. తగిన ఆధారాలు చూపగలిగితేనే ఆరోపణలు చేయండి అంటూ నీతి సూత్రాలు వల్లించారు.
బిహార్‌లోని పట్నా లోక్‌సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న శత్రుఘ్నసిన్హా.. లాలూకు మద్దతుగా ట్వీట్స్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలోనూ ఆయన బీజేపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. అయితే... ఎందుకనో పార్టీ మాత్రం ఆయన్ను ఉపేక్షిస్తూనే ఉంది.