Begin typing your search above and press return to search.
పులుల కంటే మనుషుల ప్రాణాలకు విలువివ్వండి: బీజేపీ ఎంపీ
By: Tupaki Desk | 4 Jan 2021 3:30 PM GMTవివాదాస్పద ఆరోపణలకు కేంద్రబిందువైన ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాకు పొరుగున ఉన్న మహారాష్ట్ర తడోబా అభయారణ్యం నుంచి పెద్ద పులులు వచ్చి ఇప్పటికే ఇద్దరు మనుషుల ప్రాణాలు తీశాయి. పొలంలో పనిచేసుకుంటున్న వారిని చంపేశాయి. దీంతో పులుల భయం ఆదిలాబాద్ గిరిజన తండాల్లో ఆవహించింది.
ఈ క్రమంలోనే ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు మండిపడ్డారు. గిరిజనులను వెళ్లగొట్టాలనే ఆలోచనతోనే పులుల్ని తెచ్చి గ్రామాల్లో వదులుతున్నారని ఆరోపించారు. పులులను పట్టుకోవడం అటవీశాఖకు పెద్ద సమస్య కాదని, కుట్రపూరితంగానే పులులను తెచ్చారని ఆరోపించారు. మనుషుల ప్రాణాల కంటే పులుల ప్రాణాలు ముఖ్యం కాదన్నారు.
ఇప్పటికైనా మనుషుల ప్రాణాలకు విలువ ఇవ్వాలన్నారు. నక్సల్స్ తో సంబంధాలున్నాయని ఆదివాసులను చంపుతున్నారని బీజేపీ ఎంపీ మండిపడ్డారు. అభయారణ్యాల మధ్యలో ఉన్న గిరిజనులను ఖాళీ చేయించాలని ఈ పులుల ఎత్తుగడ వేస్తున్నారని ఆయన ఆరోపించారు.
గిరిజన బిడ్డలపై వన్యమృగాలు దాడి చేయాలని.. ప్రభుత్వమే ఈ పులలను వదులుతోందని సోయం బాపూరావు మండిపడ్డారు. ఆదివాసీలను పులుల నుంచి కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.