Begin typing your search above and press return to search.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ త‌ప్పుః బీజేపీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి.. సీఎం జ‌గ‌న్ తో భేటీ!

By:  Tupaki Desk   |   10 March 2021 4:30 PM GMT
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ త‌ప్పుః బీజేపీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి.. సీఎం జ‌గ‌న్ తో భేటీ!
X
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీక‌రిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం త‌ప్పుడు నిర్ణ‌యం తీసుకుంద‌ని ఆ పార్టీ ఎంపీ, త‌మిళ‌నాడు బీజేపీ నేత సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ విష‌యంలో ప్ర‌ధానితో మాట్లాడేందుకు ఏసీ సీఎం జ‌గ‌న్ తో క‌లిసి వెళ్తాన‌ని అన్నారు. బుధ‌వారం ఆయ‌న ఏపీలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తో స‌మావేశ‌మ‌య్యారు.

తాడేప‌ల్లి సీఎం నివాసానికి వ‌చ్చిన సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామిని ముఖ్య‌మంత్రి శాలువాతో స‌త్క‌రించారు. అనంత‌రం వీరిద్ద‌రూ కాసేపు మాట్లాడుకున్నారు. ఈ భేటీలో టీటీడీ అంశంతోపాటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ విష‌యం కూడా చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు ప‌రం చేస్తూ తీసుకున్న నిర్ణ‌యం స‌బ‌బు కాద‌న్నారు. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను గుడ్డిగా ప్రైవేటీక‌రిస్తే తాను వ్య‌తిరేకిస్తానని అన్నారు సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి. ప్ర‌ధాని అపాయింట్ మెంట్ ల‌భిస్తే.. జ‌గ‌న్ తో క‌లిసి వెళ్లి స్టీల్ ప్లాంట్ విష‌యం మాట్లాడుతాన‌న్నారు. ఈ విష‌యంలో తాను ఏపీ ప్ర‌భుత్వానికి పూర్తిగా మ‌ద్ద‌తు తెలుపుతున్నాన‌ని చెప్పారు.

కాగా.. టీటీడీపై త‌ప్పుడు క‌థ‌నాలు రాసింద‌ని ఓ ప్ర‌ధాన ప‌త్రిక‌పై రూ.100 కోట్ల‌కు ప‌రువు న‌ష్టం దావా వేసిన‌ట్టు అంతకు ముందుగా ప్ర‌క‌టించారు. అదేవిధంగా.. తిరుమ‌ల వేంక‌టేశ్వ‌ర స్వామిపై చంద్ర‌బాబు నాయుడు చేసిన ఆరోప‌ణ‌ల‌పైనా తిరుప‌తి కోర్టులో మ‌రో కేసు వేయ‌బోతున్న‌ట్టు సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి చెప్పారు.