Begin typing your search above and press return to search.

పశువుల కొట్టంలో పడుకొన్న ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   4 April 2017 9:44 AM GMT
పశువుల కొట్టంలో పడుకొన్న ఎమ్మెల్యే
X
రాజకీయ నేతల భోగభాగ్యాలకు లెక్కే ఉండదు. కొందరు మాత్రం అన్నిటికీ అతీతంగా ఉంటూ సింపుల్ లైఫ్ స్టైల్ తో ప్రత్యేకంగా ఉంటారు. కర్ణాటక మాజీ మంత్రి - బెంగళూరు నగరంలోని రాజాజీనగర బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ కుమార్ కూడా అంతే. ఆయనకు విలాసాలు అస్సలు నచ్చవట. గతంలో యడ్యూరప్ప మంత్రి వర్గంలో ఆయన మంత్రిగా పని చేసే సమయంలో సాదారణ కార్యకర్తలాగే ఉండేవారు.

తాజాగా కర్ణాటకలో జరుగుతున్న ఉప ఎన్నికల సందర్బంగా సురేష్ కుమార్ మళ్లీ హాట్ టాఫిక్ గా మారిపోయారు. అన్ని సౌకర్యాలు ఉన్న స్టార్ హోటల్ లో ఆయనకు బస ఏర్పాటు చేసినా కాదని పశువుల పాకలో ఉండడంతో అంతా షాకవుతున్నారు. ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త నుంచి ఎదిగిన ఆయన ఇప్పటికీ డొక్కు స్కూటర్ పైనే తిరుగుతుంటారు.

ఇప్పుడు నంజనగూడు ఉప ఎన్నికల సందర్బంగా అక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి వి. శ్రీనివాస్ ప్రసాద్ కు మద్దతుగా ప్రచారానికి వచ్చిన ఆయనకు మంచి హోటల్ లో ఏర్పాట్లు చేసినా అక్కడకు వెళ్లకుండా ఆ సమీపంలోనే కపిలేష్ అనే రైతుకు చెందిన తోటలోని పశువుల పాకలో బస చేశారు. పశువుల కోసం ఏర్పాటు చేసిన పెద్ద షెడ్ లో ఒక పరుపు వేసుకుని దినపత్రికలు చదువుతూ, స్థానిక గ్రామస్తులతో కబుర్లు చెప్పుకుంటూ రాత్రిపూట కాలం గడిపేస్తున్నారు. మన ఎమ్మెల్యేల నుంచి అలాంటిదేమీ ఆశించొద్దు సుమా..

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/