Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఢిల్లీకి ఎందుకెళ్లారో చెప్పిన బీజేపీ ఎంపీ

By:  Tupaki Desk   |   16 Sep 2021 12:30 AM GMT
కేసీఆర్ ఢిల్లీకి ఎందుకెళ్లారో చెప్పిన  బీజేపీ ఎంపీ
X
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా కొనసాగుతోంది. గత వారం దేశ రాజధానిలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత కేసీఆర్ ఒక వారానికి పైగా ఢిల్లీలో ఉన్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్.. ఏకంగా బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ చీఫ్ చీప్ రేవంత్ రెడ్డి సహా పలువురు రాజకీయ నాయకులు విమర్శలు గుప్పించారు.

రేవంత్ రెడ్డి అయితే "గల్లీ లో కుస్తీ ... ఢిల్లీ లో దోస్తి" వంటి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ పుకార్లను ఖండిస్తూ నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసిఆర్ ఢిల్లీ పర్యటన వెనుక ఇతర తీవ్రమైన కారణాలు ఉన్నాయని ఆయన అన్నారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంత్రి కేటిఆర్ కి నోటీసులు పంపినట్లు బిజెపి ఎంపీ అరవింద్ చెప్పుకొచ్చారు. కేటీఆర్ కారణంగానే కేసిఆర్ ఢిల్లీలో రెండు రోజులకు పైగా ఉన్నారని వివరించారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటన కేటీఆర్‌ను జైలులో పెట్టకుండా నిరోధించే ప్రయత్నమని ఆయన ఆరోపించారు.

సెప్టెంబర్ 17న నిర్మల్‌లో పర్యటనకు వస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షా ప్రతిస్పందన నుంచి తనకు ఈ దిగ్భ్రాంతికరమైన విషయం తెలిసిందని అరవింద్ చెప్పారు. టిఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ఓట్ల కోసమే హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా అమలు చేస్తున్నారని ఎంపీ విమర్శించారు. దళితులు హుజూరాబాద్‌లో మాత్రమే జీవిస్తున్నారా అని ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు. "కడియం శ్రీహరి -రాజయ్య వంటి సీనియర్ రాజకీయ నాయకులను కేసిఆర్ పక్కన పెట్టాడు, ఎందుకంటే దళితులు రాజకీయంగా ఎదగడాన్ని ఆయన చూడలేకపోయారు." అని ఎంపీ అరవింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మాజీ మంత్రి, బిజెపి నాయకుడు ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఉపఎన్నికల్లో విజయం సాధిస్తారని అరవింద్ నొక్కిచెప్పారు. ఇతర రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలకు కోట్లు ఖర్చు చేయడం వృధా అని అన్నారు. తన బట్టతల మీద విమర్శలపై అరవింద్ స్పందిస్తూ ‘కెసిఆర్, కెటిఆర్‌ని ఎగతాళి చేసారు. వారు అందంగా ఉన్నారా అని’ అరవింద్ ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డిపై కూడా ఎంపీ అరవింద్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అతన్ని "పొట్టోడు" అని పిలిచాడు.. కాంగ్రెస్ లోకి ప్రవేశించిన పొట్టోడు కూడా నన్ను విమర్శిస్తున్నాడని విమర్శించాడు.

ఈ ఊహాగానాలన్నీ పక్కన పెడితే కేసీఆర్ ఢిల్లీ అమిత్ షాను కలిసినందుకు.. మామూలు కంటే ఎక్కువ రోజులు ఢిల్లీలో ఉండడానికి కారణం ఏంటనే దానిపై తెలంగాణ రాజకీయ నాయకులను ఇప్పటికీ కలవరపెడుతూనే ఉంది.